NBK 111: బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాస్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. అఖండ 2 షూటింగ్‌కు మంగళవారం నాటితో గుమ్మడికాయకొట్టినట్లు సమాచారం.
ఎన్‌బీకే 111 లాంఛ్…
అఖండ 2 పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని మూవీని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు బాలకృష్ణ సన్నాహాలు చేస్తున్నారట. ఎన్‌బీకే 111 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. దసరాకు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ లాంఛ్ కానున్నట్లు సమాచారం. అక్టోబర్ మూడో వారం నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నట్లు తెలిసింది.
Also Read- Junior OTT: ఓటీటీలో శ్రీలీల మూవీకి షాక్ – జూనియర్ పోస్ట్‌పోన్ – కారణమిదేనా?
హిస్టారికల్ కాన్సెప్ట్‌తో…
ఎన్‌బీకే 111 మూవీని హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ కథాంశంతో గోపీచంద్ మలినేని రూపొందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో బాలకృష్ణ యోధుడైన మహారాజుగా కనిపిస్తాడని టాక్. సినిమాలో ఆయన గెటప్, లుక్ విభిన్నంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ హిస్టారికల్ ఎపిసోడ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుందని అంటున్నారు. హిస్టారికల్ సినిమాలు బాలకృష్ణకు ఇష్టమైన జానర్ కావడంతో ఫస్ట్ ఆ ఎపిసోడ్స్‌తోనే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సెట్స్ లో కాకుండా రియల్ లొకేషన్స్‌లోనే హిస్టారికల్ ట్రాక్‌ను షూట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం లొకేషన్స్ రెక్కీలో టీమ్ ఉన్నట్లు చెబుతున్నారు.
గర్జిస్తున్న సింహం…
ఎన్‌బీకే 111 హిస్టారికల్ మూవీ అని అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనూ మేకర్స్ హింట్ ఇచ్చారు. గర్జిస్తున్న సింహం పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సగం ముఖం నార్మల్‌గా, మరో సగం ముఖం యుద్ధాల్లో రాజులు వాడే మెటల్ ఆర్మర్ తొడిగి ఈ సింహం కనిపించడం ఆసక్తిని పంచింది. చారిత్రక అంశాలకు నేటి కాలాన్ని ముడిపెడుతూ ఎన్‌బీకే 111 సాగుతుందని అంటున్నారు. బాలకృష్ణ రోల్ డ్యూయల్ షేడ్స్‌లో ఉంటుందట. బాలకృష్ణ మూవీతోనే ఫస్ట్ టైమ్ గోపీచంద్ మలినేని హిస్టారికల్ జానర్‌ను టచ్ చేయబోతున్నారు. తన రూట్ మార్చి కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కిస్తోన్నాడు.
పెద్ది నిర్మాత…
ఎన్‌బీకే 111 మూవీని పెద్ది సినిమా ప్రొడ్యూసర్ కిలారు వెంకట సతీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపొందనున్నట్లు టాక్. కాగా గతంలో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వీరసింహారెడ్డి రూపొందింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ 100 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది.


