Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNbk 111: బాల‌కృష్ణ సినిమాలో లేడీ సూప‌ర్‌స్టార్ - నాలుగోసారి జోడీ కుదిరిందా?

Nbk 111: బాల‌కృష్ణ సినిమాలో లేడీ సూప‌ర్‌స్టార్ – నాలుగోసారి జోడీ కుదిరిందా?

Nbk 111: ప్ర‌స్తుతం చిరంజీవితో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు సినిమా చేస్తోంది లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా మూడేళ్ల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు రిలీజ్ కాక‌ముందే తెలుగులో మ‌రో స్టార్ హీరో మూవీకి న‌య‌న‌తార గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

- Advertisement -

వీర‌సింహారెడ్డి సూప‌ర్ హిట్ త‌ర్వాత బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మ‌రో భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమా అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చాలా రోజుల క్రిత‌మే వ‌చ్చింది. న‌వంబ‌ర్ 7న పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు టాక్‌. న‌వంబ‌ర్ మూడో వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లు పెట్ట‌నున్నార‌ట‌.

Also Read – Malvika Sharma: అందాల ఆరబోతలో రవితేజ హీరోయిన్ రచ్చ

కాగా ఈ సినిమాలో బాల‌కృష్ణ‌కు జోడీగా న‌య‌న‌తారను హీరోయిన్‌గా ఎంపిక‌ చేసిన‌ట్లు స‌మాచారం. ద‌క్షిణాదితో పాటు ప‌లువురు బాలీవుడ్ హీరోయిన్ల‌ పేర్ల‌ను ప‌రిశీలించిన మేక‌ర్స్ చివ‌ర‌కు న‌య‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. న‌య‌న‌తార‌, బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న నాలుగో మూవీ ఇది. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సింహా, శ్రీరామ‌రాజ్యంతో పాటు జై సింహా సినిమాలొచ్చాయి. వీటిలో సింహా బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌గా… మిగిలిన రెండు సినిమాలు యావ‌రేజ్‌గా నిలిచాయి. జై సింహా అనంత‌రం దాదాపు ఏడేళ్ల గ్యాప్ త‌ర్వాత బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార క‌లిసి గోపీచంద్ మ‌లినేని మూవీలో న‌టించ‌బోతున్నారు.

రామ్‌చ‌ర‌ణ్ పెద్ది సినిమాను నిర్మిస్తున్న వెంక‌ట స‌తీష్ కిలారు… బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వంద కోట్ల‌కుపైగా బ‌డ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తున్న 111 సినిమా ఇది. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన అఖండ 2 డిసెంబ‌ర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆది పినిశెట్టి విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. డిసెంబ‌ర్‌లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాలో అఖండ 2పైనే భారీగా ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి.

Also Read – Comedian Satya: హీరోగా ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ క‌మెడియ‌న్ – మ‌త్తువ‌ద‌ల‌రా డైరెక్ట‌ర్‌తో మూవీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad