Sunday, June 8, 2025
Homeచిత్ర ప్రభBalakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బ్లాక్ బాస్టర్ కాంబో రిపీట్

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బ్లాక్ బాస్టర్ కాంబో రిపీట్

నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇటీవల ఫుల్ ఫాంలో ఉన్నారు. వరుసగా సూపర్ హిట్లతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన గత నాలుగు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో తన నట విశ్వరూపం చూపించిన బాలయ్య… ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ2 చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.

ఇదిలా ఉండగానే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తనకు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు. రెండున్నర సంవత్సరాల క్రితం వీరి కాంబోలో వచ్చిన వీరసింహా రెడ్డి అభిమానులకు పూనకాలు తెప్పించింది. మూవీలో బాలయ్య చెప్పిన డైలాగ్స్, ఫైట్స్, గోపిచంద్ టేకింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో బాలయ్య లుక్, యాక్టింగ్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

ఇక మరో రెండు రోజుల్లో బాలయ్య 66వ ఏటలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేందుకు వరుస అప్టేడ్స్ రెడీగా ఉన్నాయి. తాజాగా గోపిచంద్ మలినేనితో కొత్త సినిమా ప్రకటనతో పాటు, అఖండ2 టీజర్, లక్ష్మీనరసింహా సినిమా రీరిలీజ్ తో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News