ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) పద్మ భూషణ్ అవార్డు(Padma Bhushan) అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు ఈ పురస్కారం అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది.
- Advertisement -
ఈ కార్యక్రమానికి బాలయ్య పెద్ద అల్లుడు, మంత్రి నారా లోకేశ్ దంపతులు, చిన్న అల్లుడు ఎంపీ భరత్ దంపతులు, కుమారుడు మోక్షజ్ఞ తేజ, సతీమణి వసుంధర, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, హాజరయ్యారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి బాలయ్య హాజరయ్యారు. కాగా గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాల్లో కళారంగం నుంచి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వరించింది.
