Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAkhanda 2: త‌మ‌న్ వ‌ల్లే ఆల‌స్యం - అఖండ 2 రిలీజ్‌పై బాల‌కృష్ణ కామెంట్స్ వైర‌ల్...

Akhanda 2: త‌మ‌న్ వ‌ల్లే ఆల‌స్యం – అఖండ 2 రిలీజ్‌పై బాల‌కృష్ణ కామెంట్స్ వైర‌ల్…

Akhanda 2: అఖండ 2 రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్‌గా క్లారిటీ వ‌చ్చేసింది. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు బాల‌కృష్ణ ప్ర‌క‌టించారు. అఖండ 2 సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ కావాల్సి ఉండ‌గా.. సినిమాను పోస్ట్‌పోన్ చేశారు మేక‌ర్స్‌. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కంప్లీట్ కాలేద‌ని, క్వాలిటీ విష‌యంలో రాజీప‌డ‌కూడ‌ద‌నే వాయిదావేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అఖండ 2తో పాటు సెప్టెంబ‌ర్ 25న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ కూడా రిలీజ్ కాబోతుంది. ఓజీ కోస‌మే అఖండ 2ను పోస్ట్‌పోన్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అఖండ 2 కొత్త రిలీజ్ డేట్‌ను ఇప్ప‌టివ‌ర‌కు మేక‌ర్స్ వెల్ల‌డించ‌లేదు. సంక్రాంతికి రిలీజ్ కానుందంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఈ పుకార్ల‌కు బాల‌కృష్ణ పుల్‌స్టాప్ పెట్టేశారు.

- Advertisement -

డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో…
డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లోనే అఖండ 2 రిలీజ్ కానున్న‌ట్లు బాల‌కృష్ణ ప్ర‌క‌టించారు. అఖండ‌కు రెట్టింపు కాదు.. యాభై రెట్లు గొప్ప‌గా ఈ సీక్వెల్ ఉంటుంద‌ని అన్నారు. మంచి ఉద్దేశంతో తీసిన సినిమా ఇద‌ని పేర్కొన్నారు. స‌గం సినిమాకే స‌బ్ ఊఫ‌ర్లు పేలిపోయాయంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించండి.. అంటూ అఖండ 2 గురించి బాల‌కృష్ణ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Also Read- Ghaati: ‘ఘాటి’ ప్రీమియ‌ర్స్ టాక్ – అనుష్క విశ్వ‌రూపం – యాక్ష‌న్ సీన్లు అదుర్స్‌

త‌మ‌న్ వ‌ల్లే పోస్ట్‌పోన్‌…
మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్.. సినిమా కోసం త‌న‌కు ఇచ్చిన‌ టైమ్ స‌రిపోలేద‌ని అన్నాడ‌ని బాల‌కృష్ణ చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమా పోస్ట్‌పోన్‌కు త‌మ‌న్ కార‌ణ‌మంటూ ఇన్‌డైరెక్ట్‌గా బాల‌కృష్ణ క్లారిటీ ఇచ్చాడ‌ని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం త‌మ‌న్ అఖండ 2తో పాటు ఓజీ, రాజాసాబ్‌, తెలుసు క‌దా.. స‌హా మ‌రికొన్ని సినిమాల‌కు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ బిజీ షెడ్యూల్స్ వ‌ల్ల అఖండ 2 రీ రికార్డింగ్ డిలే అయ్యంద‌ని, అందువ‌ల్లే సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేయాల్సివ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. అఖండ 2 సినిమాకు సంబంధించి త‌మ‌న్ వ‌ర్క్ మాత్ర‌మే బ్యాలెన్స్‌గా ఉంద‌ని అంటున్నారు. త‌మ‌న్ క‌రెక్ట్ టైమ్‌లో వ‌ర్క్ షినిష్ చేసి ఉంటే ఈ నెల‌లోనే ఈ సినిమా వ‌చ్చేద‌ని చెబుతున్నారు.

సంయుక్త మీన‌న్ హీరోయిన్‌…
అఖండ 2 మూవీలో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాలీవుడ్ న‌టి హ‌ర్షాలీ మ‌ల్హోత్రా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అఖండ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్ల‌స్ ప‌తాకంపై రామ్ ఆచంట‌, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

Also Read- NIRF Rankings : తెలుగు వర్సిటీల విజయఢంకా – జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన జయశంకర్ వర్సిటీ!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad