Balakrishna: బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ కాంబోలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడుతో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు చేశారు బాలకృష్ణ. గౌతమీపుత్ర శాతకర్ణి బ్లాక్‌బస్టర్‌గా నిలవగా… ఎన్టీఆర్ బయోపిక్ మూవీస్ మాత్రం నిరాశను మిగిల్చాయి. ఈ సినిమాల రిజల్ట్‌తో సంబంధం లేకుండా బాలకృష్ణ, క్రిష్ కాంబోలో నాలుగో సినిమా కన్ఫామ్ అయినట్లు సమాచారం.
బాలకృష్ణ 112 మూవీగా…
ప్రస్తుతం అఖండ2 సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సీక్వెల్ తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల తర్వాతే క్రిష్ డైరెక్షన్‌లో చేయనున్న సినిమా సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం. బాలకృష్ణ 112వ మూవీగా తెరకెక్కనున్నట్లు చెబుతోన్నారు. హిస్టారికల్ ఎలిమెంట్స్‌తో సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా క్రిష్ సినిమా ఉండబోతున్నట్లు చెబుతోన్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో బాలకృష్ణ, క్రిష్ మూవీ సెట్స్‌పైకి రానున్నట్లు చెబుతోన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Also Read – Longest Solar Eclipse: ఈ శతాబ్దపు అతిపెద్ద సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా? ఇది మన దేశంలో కనిపిస్తుందా?
గుమ్మడికాయ…
అఖండ 2 షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఓ పాట మినహా టాకీపార్ట్ మొత్తం పూర్తయినట్లు సమాచారం. ఆగస్ట్‌లో బ్యాలెన్స్‌గా ఉన్న సాంగ్‌ను షూట్ చేసి సినిమాకు గుమ్మడికాయ కొట్టేందుకు మేకర్స్ రెడీ అవుతోన్నారు. సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ కాబోతుంది. మైథలాజికల్ టచ్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించబోతున్నాడు. అఖండ కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆగస్ట్‌లో…
ఆగస్ట్ నెలాఖరు నుంచి గోపీచంద్ మలినేని షూటింగ్‌లో మొదలుపెట్టేందుకు బాలకృష్ణ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2026 ప్రథమార్థంలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు క్రిష్ దర్శకత్వం వహించిన ఘాటి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అనుష్క హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు హీరోగా కనిపించబోతున్నాడు. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read – WAR 2 Trailer: నువ్వా నేనా!..పవర్‌ఫుల్ యాక్షన్ మూవీగా ‘వార్ 2’.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్


