Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభBalayya 50 years in Tollywood: బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానం సంబరాలు

Balayya 50 years in Tollywood: బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానం సంబరాలు

ఇండస్ట్రీ సమస్యలు అడిగి తెలుసుకున్న సీబీఎన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, కె. ఎల్. నారాయణ, అలంకార్ ప్రసాద్, నిర్మాత జెమినీ కిరణ్ , నిర్మాత- డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, రాజా యాదవ్.

- Advertisement -

నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించారు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. నారా చంద్రబాబు నాయుడు ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇండస్ట్రీ సమస్యలను, విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News