NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గతకొంతకాలంగా చేస్తున్న సినిమాలన్ని ఆయన వయసుకు తగ్గ పాత్రలు ఉన్నవే ఎంపిక చేసుకుంటూ వరుస హిట్స్ అందుకుంటున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోలతోనే పోటీ పడుతున్న బాలయ్య మిగతా వారికంటే ఎక్కువ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఆయన గత చిత్రం డాకు మహారాజ్ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీనుతో చేస్తున్న ఆఖండ 2 తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోకి మంచి క్రేజ్ ఉంది. సింహా, లెజెండ్, అఖండ సినిమాలు హ్యాట్రిక్ హిట్ సాధించాయి. ఇక రాబోతున్న అఖండ 2 కూడా భారీ హిట్ సాధిస్తుందనే ధీమాతో మేకర్స్ ఉన్నారు. ఇక ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయబోతున్నారు. దసరా పండుగ సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.
Also Read – Nag Ashwin: రూట్ మారుస్తోన్న నాగ్ అశ్విన్.. ఆలియా స్థానంలో సాయి పల్లవి
అఖండ 2 తర్వాత బాలయ్య మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నారు. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి మంచి విజయాన్ని అందుకుంది. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టు గోపీచంద్ మలినేని ఎలివేషన్స్ బాలయ్యను స్క్రీన్ మీద చూపించిన విధానానికి నందమూరి అభిమానులు సూపర్ ఎగ్జైట్ అయ్యారు. ఇదే కాంబోలో మరో సినిమా వస్తే బావుంటుంది అనుకున్నారు. వారి కోరిక మేరకు ఇదే కాంబోలో మరో సినిమా సెట్స్‌పైకి రాబోతోంది.
ప్రస్తుతానికి ఎన్‌బీకే 111 పేరుతో చిత్రీకరణ జరపనున్న ఈ మూవీలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్నారట. అలెగ్జాండర్ పాత్రను ఆధారంగా చేసుకొని గోపీచంద్ మలినేని బాలయ్య కోసం రెండు రకాల పాత్రలను తీర్చిదిద్దిన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ అక్టోబర్ 24న ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకొని ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుందట చిత్రబృదం. ఈ సినిమాను వృద్ది సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించనున్నారు. త్వరలో మిగతా వివరాలు వెల్లడి కానున్నాయి.
Also Read – KGF 3: ‘సలార్ 2’ కంటే ముందు యష్-నీల్ క్రేజీ మూవీ!


