Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభGunde Ninda Gudigantalu January 21th Episode: ఫస్ట్‌నైట్ గదిలో నుంచి రవిని బయటకి తోసేసిన...

Gunde Ninda Gudigantalu January 21th Episode: ఫస్ట్‌నైట్ గదిలో నుంచి రవిని బయటకి తోసేసిన బాలు..

ఈరోజు ఎపిసోడ్‌లో సత్యం కోడళ్లకి, కొడుకులకు మంచి చెడ్డలు చెప్పి కలిసి మెలసి ఉండాలని చెప్తాడు. మీనా, రోహిణిలు మావయ్య గారు మాటలకు తప్పకుండా మేము ఎప్పటికి కలిసి ఉంటాము అని సమాధానమిస్తే శృతి మాత్రం సత్యం ని హత్తుకుని మీరు సూపర్ చెప్పారు అంకుల్ మా నాన్న కుడా ఎప్పుడూ ఇలా చెప్పలేదు అని చెప్తే ఇంట్లో అందరూ నోరు వదిలేసి చూస్తారు. ఇంక లేట్ అవుతుంది వెళ్తాము అని రూమ్‌లోకి వెళ్లిపోతారు.

- Advertisement -

రూమ్‌లో శృతికి రవి క్లాస్ పీకుతాడు నువ్వు అలా చేయకు మా నాన్న హర్ట్ అవుతారు అంటే నేను మా నాన్నను అలానే హగ్ చేసుకుంటాను అంటుంది శృతి. ఈలోగా డోర్ కొట్టినట్టు సౌండ్ వస్తే వెళ్లు మీ బాలు అన్నయ్య మళ్లీ తాగి వచ్చి తన్నుతున్నట్టున్నాడు వెళ్లి తీయి అంటే అక్కడ మీనా ఉంటుంది. మీనా పాలు ఇచ్చి పైకి బాలు దగ్గరికి వెళ్తుంది. బాలు అక్కడ పాటలు పాడుకుంటూ ఉంటాడు. మీనా వెళ్లి ఎందుకు ఆమెతో అస్తమానూ గొడవ పడతారు వాళ్లని పట్టించుకోకండి ఆమె జోలికి వెళ్లకండి అంటుంది. బాలు ఏమో నువ్వు రోజు రోజుకు వాళ్లకి సపోర్ట్ చేసి నన్ను పక్కకి తోసేస్తున్నావు అంటాడు. మీ నాన్న గారెకి హార్ట్ అటాక్ రావడానికి మీరే కారణమూ కాదో అందిరినీ అడుగుతాను అంటే ఆ పని మాత్రం చేయకండి అని మీనా ఆపేస్తుంది.

మరోవైపు ప్రభావతి పాలు తీసుకుని గదిలోకి సిగ్గు పడుతుంటే సత్యం ఏంటి తెగ సిగ్గు పడుతున్నావు నువ్వేనా అంటాడు. ఇక చూడు కొత్తగా పెళ్ళైన జంట లాగ ప్రవర్తిస్తారు. బాలు గాడు తప్ప ఇళ్లంతా కలకలలాడుతుంది అంటుంది ప్రభావతి. అక్కడ మనోజ్, రోహిణిలు కుడా వాళ్ల ఫస్ట్‌నైట్ రోజులను గుర్తుచేసుకుంటారు. ఆలా ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటారు. అక్కడ రవి, శృతిలు కుడా ఇంట్లో వాళ్ల గురించి మట్లాడుకుని రొమాన్స్‌లో ములిగిపోతారు. ఇంతటతో ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad