Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభGunde Ninda Gudigantalu January 31th Episode: మీనా చేసిన చపాతీలు రవి, శృతి తినలేదని...

Gunde Ninda Gudigantalu January 31th Episode: మీనా చేసిన చపాతీలు రవి, శృతి తినలేదని వీరంగం మొదలుపెట్టిన బాలు..

ఈరోజు ఎపిసోడ్‌లో బాలు ఫ్రెండ్స్‌తో ఇంట్లో జరిగిన విషయాలు అన్నీ చెప్పి మందు తాగుతాడు. ఫుల్‌గా తాగి ఇంటికి వెళ్లిన బాలుని మీనా ఎందుకు తాగారు అని అడగుతుంది.నేను తాగలేదు అని బాలు వాదిస్తాడు. మీరు తాగారో లేదో నేను చెప్తాను అని చేతి వేలు చూపించు చాక్‌పీస్ కనిపిస్తుందా అని అడిగితే బాలు బాగా బుక్ అయిపోయాడు.

- Advertisement -

కిందకి తినడానికి వెళ్తే మీనా చపాతీలు చేసిందని బాలు ఆమ్లెట్ వేయమంటాడు. ఈలోగా సత్యం, ప్రభావతి వాకింగ్‌కి వెళ్లి వస్తారు. తర్వాత రవి, శృతి కుడా వస్తారు. మీరు తినండి రండి అని మీనా పిలిస్తే వద్దు మేము బయట తినేసాము అంటారు. ఇంక అంతే బాలు మళ్లీ గొడవ మొదలు పెడతాడు.

పొద్దున్న నుంచి ఇంట్లో పనులు అన్నీ చేసి మీకోసం వంట చేస్తే ఇప్పుడు తినము అంటే ఇప్పుడు అవి ఎవడు తింటాడు అంటాడు. ఇంట్లో వాళ్లు అందరూ చెప్పినా బాలు వినకుండా చపాతీలు అన్నీ రవి నోట్లో కుక్కుతాడు. శృతి ఆపి ఇష్టమొచ్చినట్టు ఇంగ్లీషులో తిడుతుంది. బాలుని తాగబోతు అని అందరూ తిడుతుంటే బాలు రవి,మనోజ్ ఏమైనా బుద్దిమంతులా వాళ్లకి తాగుడు తెలియదా అని వాళ్ల పెళ్లాళ్ల ముందు ఇరికించేశాడు.నా డబ్బులతో ఒకరోజు మేడ మీద ఈ ఇద్దరు వెదవలు బీర్ల మీద బీర్లు తాగేశారు అంటాడు. నవ్వు తాగుతావా అంటూ నువ్వు తాగుతావా అని శృతి రవిని, రోహిణి, మనోజ్ ని అడిగి రూమ్‌లోకి తీసుకెళ్తారు ఉతకడానికి ఎవరి గదికి వాళ్లు కొట్టుకోవడానికి వెళ్లిపోతారు. బాలు ఈగో సాటిఫై అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad