Monday, May 19, 2025
Homeచిత్ర ప్రభBandla Ganesh : చాలా నష్టపోయాను.. రాజకీయాలపై బండ్లగణేష్ సంచలన వ్యాఖ్యలు..

Bandla Ganesh : చాలా నష్టపోయాను.. రాజకీయాలపై బండ్లగణేష్ సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -

Bandla Ganesh : సినిమాల్లో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి అనంతరం స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు బండ్ల గణేష్. కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో కూడా ఉన్నారు. సినిమాల కంటే కూడా బండ్ల గణేష్ ఆయన మాటలతో, ట్వీట్స్ తో, స్పీచ్ లతో మరింత ఫేమస్ అయ్యారు.

ఇటీవలే కొన్ని రోజుల క్రితం బండ్లగణేష్ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తూ.. నేను రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నాను. ఇక నాకు, రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు. నాకెవరు శత్రువులు లేరు. రాజకీయ నాయకులంతా నా ఆత్మీయులే అని అన్నారు. దీంతో పలువురు బండ్లగణేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా పలువురు నెటిజన్స్ చేసిన కామెంట్స్ కి బండ్ల్ గణేష్ రిప్లై ఇస్తూ మరోసారి రాజకీయాలపై వ్యాఖ్యలు చేశాడు. ”ఎందరో ఆత్మీయులు కోల్పోవాలి, ఎందరికో శత్రువులు కావాలి. నా మట్టుకు నేను సినిమా సినిమా సినిమా. అందులో ఉన్న కిక్కు ఎక్కడా నాకు దొరకదు అనిపించింది. అందుకే సినిమా సినిమా సినిమా సినిమా. నా జీవితం సినిమా.
రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను. నాకు ఏ రాజకీయాలతో, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, అందరూ ఆత్మీయులే” అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. దీంతో బండ్ల పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు మరోసారి ఫుల్ గా క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News