Bandla Ganesh: సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ప్రకటించారు. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్షన్‌లో రూపొందిన తెలుసు కదా మూవీ సక్సెస్‌మీట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో బండ్ల గణేష్ పాల్గొన్నారు.
ఈ సక్సెస్ మీట్‌లో తన రీఎంట్రీని కన్ఫామ్ చేశారు బండ్ల గణేష్. ‘‘నేను టెంపర్ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నా. ఫ్లాప్ ఇచ్చి సినిమాలకు దూరం కాలేదు. ఇప్పుడు కొత్తగా సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టబోతున్నా. ఇక నుంచే అసలు సినిమా మొదలవుతుంది’’ అని బండ్ల గణేష్ కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 2015 రిలీజైన టెంపర్ ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్ నిర్మించిన చివరి సినిమా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్‌ను గట్టెక్కించింది.
Also Read- NC24: బంపరాఫర్ కొట్టేసిన గుంటూరు కారం హీరోయిన్ – నాగచైతన్యతో రొమాన్స్‌కు రెడీ
స్టార్ హీరో మూవీతోనే ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్‌తో సినిమాతోనే బండ్ల గణేష్ సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేష్‌కు మంచి అనుబంధం ఉంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ సినిమా అనౌన్స్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
కమెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన బండ్ల గణేష్ అంజనేయులు మూవీతో ప్రొడ్యూసర్‌గా మారాడు. టాలీవుడ్ అగ్ర కథానాయకులతో సినిమాలు నిర్మించాడు. పవన్ కళ్యాణ్‌తో తీన్‌మార్, గబ్బర్‌సింగ్.. ఎన్టీఆర్‌తో బాద్‌షా, టెంపర్.. అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో.. రామ్ చరణ్‌తో గోవిందుడు అందరివాడేలే సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించాడు.
Also Read- Gummadi Narsaiah: తెలంగాణ మాజీ ఎమ్మెల్యే బయోపిక్ – టైటిల్ పాత్రలో కన్నడ స్టార్ హీరో
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన వినోదం మూవీతో కమెడియన్‌గా బండ్ల గణేష్ కెరీర్ మొదలైంది. వందకుపైగా సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. ఆహ్వానం, సింధూరం, చూడాలని ఉంది, నువ్వునాకు నచ్చావ్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరితో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. డేగల బాబ్జీ అనే సినిమాలో హీరోగా నటించాడు. మోహన్‌బాబు సన్నాఫ్ ఇండియా యాక్టర్‌గా బండ్ల గణేష్ చేసిన చివరి మూవీ. ఆ తర్వాత కెమెరా ముందుకు రాలేదు.


