Bandla Ganesh: బండ్ల గణేష్ స్పీచ్‌లకు టాలీవుడ్‌లో సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో పలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, సక్సెస్ మీట్‌లలో బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్‌లు వైరల్ అయ్యాయి. కొన్నిసార్లు వివాదాలకు దారితీశాయి. ఇటీవల లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో దుమారాన్నే రేపాయి. ఈ సారి విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాడు బండ్ల గణేష్. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కే ర్యాంప్ మూవీ దీపావళికి థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మిక్స్‌డ్ టాక్‌తో 40 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ర్యాంపేజ్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో కే ర్యాంప్ సక్సెస్ మీట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌కు చీఫ్ గెస్ట్‌గా బండ్ల గణేష్ అటెండ్ అయ్యారు.
ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండపై అతడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ పేరు ప్రస్తావించకుండా అతడిపై సెటైర్లు వేశారు బండ్ల గణేష్. ‘‘ఒక్క సినిమా హిట్టయితే లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు వేసుకొని వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి అంటూ అర్ధరాత్రి కూడా కళ్లద్ధాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకునే ఈ రోజుల్లో హిట్టు మీద హిట్టు కొడుతూ కూడా మన అందరి ఇంట్లో కుర్రాడిలా కిరణ్ అబ్బవరం ఉన్నారు. కిరణ్ అబ్బవరాన్ని చూస్తుంటే చిరంజీవి గుర్తొస్తున్నారు. ప్రారంభ రోజుల్లో చిరంజీవి ఇలానే ఉండేవారు. 150 సినిమాలు చేసి, రేపో మాపో భారతరత్న అందుకోబోతూ కూడా చిరంజీవి ఈ రోజుకి గ్రౌండ్ మీదే ఉంటారు’’ అని బండ్ల గణేష్ అన్నారు.
Bandla Ganesh: Tejaswi Madivada: స్టన్నింగ్ లుక్స్ తో టెంపరేచర్ పెంచేస్తున్న తేజస్వి
నీ క్యారెక్టర్ మార్చకు. నీ స్టైల్, యాక్షన్ అంత స్క్రీన్ మీదే. ఆన్‌స్క్రీన్ సింపుల్‌గా ఉండాలి. వాట్సాప్ వాట్సాప్ అంటే ఇక్కడ కుదరదు. వాస్తవానికి దగ్గరగా ఉండాలి అంటూ కిరణ్ అబ్బవరాన్ని ఉద్దేశించి బండ్ల గణేష్ ఈ సక్సెస్ మీట్‌లో కామెంట్స్ చేశారు. అంతే కాకుండా.. ‘‘ఒక్క హిట్టు కొడితే.. లోకేష్ కనగరాజ్, సుకుమార్, రాజమౌళి, అనిల్ రావిపూడిని తీసుకురా అని కండీషన్లు పెడుతున్న ఈ రోజుల్లో కిరణ్ అబ్బవరం మాత్రం వరుసగా కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా కొత్త డైరెక్టర్‌తోనే చేశాడు కిరణ్ అబ్బవరం. హీరోలంతా ఏడాదికి ఒక్క కొత్త దర్శకుడిని అయినా పరిచయం చేస్తే బాగుంటుంది. గతాన్ని మర్చిపోవద్దు. కిరణ్ అబ్బవరం వరుసగా ఆరుగురు కొత్త దర్శకులను పరిచయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. దమ్ము, ధైర్యం, ఖలేజా ఉన్న కుర్రాడు కిరణ్ అబ్బవరం’’ అని బండ్ల గణేష్ అన్నారు.
‘‘ఆస్తులు, అంతస్తులు వారసత్వంగా ఇవ్వొచ్చు. కానీ తెలివిని…సక్సెస్‌లను ఎవరూ వారసత్వంగా ఇవ్వలేరు. నేను వెయ్యి కోట్లు ఇస్తా. నాకు గబ్బర్ సింగ్ ఇవ్వండి. దానికి దమ్ముతో పాటు దేవుడి దయ, మన కష్టం, నిజాయితీ కావాలి. ప్రేమతో కష్టం, కసితో చేస్తేనే బ్లాక్‌బస్టర్ వస్తుంది. వాట్సాప్ అంటే హిట్టు రాదు’’ అని ఈ సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ అన్నారు.
Also Read- Rashmika Mandanna: చేతికి ఉన్న రింగ్స్‌పై క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్నా..
ఈ స్పీచ్‌లో విజయ్ పేరును బండ్ల గణేష్ ఎక్కడ చెప్పలేదు. కానీ నెటిజన్లు మాత్రం బండ్ల గణేష్ కామెంట్స్ చేసింది విజయ్ దేవరకొండనేనని అంటున్నారు. ఓ హీరోను పొగడటానికి మరో హీరోను తక్కువ చేసి మాట్లాడటం బాగాలేదని కొందరు నెటిజన్లు బండ్ల గణేష్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. మరికొందరు బండ్ల గణేష్ మాట్లాడిన వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయని, కొత్త హీరోల తీరు మారాలని అంటున్నారు.


