Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభBandla Ganesh: కే ర్యాంప్ స‌క్సెస్ మీట్‌ స్పీచ్‌పై బండ్ల గ‌ణేష్ యూట‌ర్న్ - ఎవ‌రిని...

Bandla Ganesh: కే ర్యాంప్ స‌క్సెస్ మీట్‌ స్పీచ్‌పై బండ్ల గ‌ణేష్ యూట‌ర్న్ – ఎవ‌రిని ఉద్దేశించి మాట్లాడలేదంటూ ట్వీట్‌

Bandla Ganesh: కే ర్యాంప్ స‌క్సెస్ మీట్‌లో తాను చేసిన కామెంట్స్‌పై యూట‌ర్న్ తీసుకున్నారు బండ్ల గ‌ణేష్‌. కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన కే ర్యాంప్ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఇటీవ‌ల ఈ మూవీ స‌క్సెస్‌మీట్‌ను మేక‌ర్స్ నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు బంగ్ల గ‌ణేష్ చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చారు. ఈ స‌క్సెస్ మీట్‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రంపై ప్ర‌శంస‌లు కురిపించారు బండ్ల గ‌ణేష్‌. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లోని కొంద‌రు హీరోల‌ను టార్గెట్ చేస్తూ ఆయ‌న చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఒక్క హిట్టు కొట్ట‌గానే వాట్సాప్ వాట్సాప్ అంటూ లూజు ప్యాంట్లు, బ్రాండెడ్ షూస్ వేసుకొని తిరుగుతున్నార‌ని బండ్ల గ‌ణేష్ అన్నారు. మిడ్‌నైట్‌లో కూడా క‌ళ్ల‌ద్ధాలు పెట్టుకొని తిరుగుతున్నార‌ని చెప్పాడు. అంతే కాదు ఒక హిట్టు ప‌డ‌గానే నెక్స్ట్ మూవీకి లోకేష్ క‌న‌గ‌రాజ్‌, రాజ‌మౌళి, సుకుమార్‌, అనిల్ రావిపూడి లాంటి డైరెక్ట‌ర్లు కావాలంటూ కండీష‌న్లు పెడుతున్నార‌ని బండ్ల గ‌ణేష్ అన్నాడు.

- Advertisement -

Also Read – Jailer 2: బాలయ్య క్రేజీ డెసిషన్స్.. రెండు సినిమాలు రిజెక్ట్!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఉద్దేశించే బండ్ల గ‌ణేష్ ఈ కామెంట్స్ చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. విజ‌య్ అభిమానులు బండ్ల గ‌ణేష్‌ను ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఓ హీరోను పొగ‌డ‌టం కోసం మ‌రో హీరోను త‌క్కువ చేస్తూ మాట్లాడ‌టం స‌రికాదంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ వివాదంపై బండ్ల గ‌ణేష్ రియాక్ట్ అయ్యారు. కే ర్యాంప్ స‌క్సెస్ మీట్‌లో తాను ఎవ‌రిని ఉద్దేశించి మాట్లాడ‌లేద‌ని సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామ‌త‌ల్లి ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే అని బుధ‌వారం ట్వీట్ చేశాడు. బండ్ల గ‌ణేష్ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

కే ర్యాంప్ కంటే ముందు లిటిల్ హార్ట్స్ స‌క్సెస్ మీట్‌లో అల్లు అర‌వింద్‌ను ఉద్దేశించి బండ్ల గ‌ణేష్ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బండ్ల గ‌ణేష్ కామెంట్స్‌పై బుధ‌వారం అల్లు అర‌వింద్ స్పందించారు. బండ్ల గ‌ణేష్ కామెంట్స్‌పై స‌మాధానం చెప్ప‌డానికి నాకో స్థాయి ఉంద‌ని అన్నారు. కాగా బండ్ల గ‌ణేష్ ప్రొడ్యూస‌ర్‌గా రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మ‌ళ్లీ సినిమాల‌ను నిర్మించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న బండ్ల గ‌ణేష్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, స‌క్సెస్ మీట్‌ల‌కు అటెండ్ అవుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అవ‌న్నీ అవాస్త‌వాలేన‌ని బండ్ల గ‌ణేష్ అన్నారు. తాను ఏ సినిమాను నిర్మించ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు.

Also Read – Guru Nanak Jayanti : భక్తులపై పాక్ మత వివక్ష – యాత్రకు వెళ్లిన 14 మంది వెనక్కి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad