Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభNilakhi Patra: ‘బ్యూటీ’ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

Nilakhi Patra: ‘బ్యూటీ’ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

‘బ్యూటీ’(Beauty) చిత్రంతో నీలఖి పాత్ర(Nilakhi Patra) త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ సినిమాను గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్ ఫేమ్ వర్ధన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటించారు.

- Advertisement -

నీలఖి తెలుగులోకి పరిచయం కాక ముందే ఒడిశాలో తన సత్తాను చాటుకుంటున్నారు. ఒడిశాలో నెంబర్ వన్ చానెల్ అయిన తరంగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన తరంగ్ సినీ ఉత్సవ్ కార్యక్రమంలో యంగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ డెబ్యూ ఫీమేల్ కేటగిరీలో నీలఖికి అవార్డు వచ్చింది. ఇక తెలుగులోనూ నీలఖి తన మార్క్ వేసుకుంటారని బ్యూటీ టీం ఎంతో నమ్మకంగా ఉంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన బ్యూటీ పోస్టర్లు, టీజర్‌లో నీలఖి అందరినీ ఆకట్టుకున్నారు. ఎమోషన్స్ పండించడంలోనూ నీలఖి పర్ఫామెన్స్ బాగుందని మూవీ టీం ఇదివరకే చెప్పేసింది. ఇక బ్యూటీ సినిమాతో నీలఖి తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. కాగా వానరా సెల్యులాయిడ్ బ్యానర్ మీద మారుతి టీం ప్రొడక్ట్‌తో కలిసి జీ స్టూడియోస్ సమర్పిస్తున్న చిత్రం బ్యూటీ. ఈ మూవీకి అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad