Nayanthara Sankranthi Movies: నయనతార టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు అవుతోంది. అయినా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. నవతరం హీరోయిన్లు ఎంత మంది వచ్చినా నయన్ స్థానాన్ని రీప్లేస్ చేయలేకపోయారు. ఆమెకు పోటీ ఇవ్వలేకపోయారు. పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్లకు ఆఫర్లు తగ్గుతాయి. కానీ నయనతార మాత్రం ఈ రూల్ నుంచి మినహాయింపుగా నిలుస్తోంది. పెళ్లి తర్వాతే జవాన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నయన్. షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ ఏకంగా 1100 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎనిమిది సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వీటిలో మెగా 157 ఒకటి.
చిరంజీవి గాడ్‌ఫాదర్ తర్వాత…
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న మెగా 157 మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. చివరగా తెలుగులో చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమా చేసింది నయనతార. మళ్లీ మూడేళ్ల తర్వాత మెగాస్టార్ మూవీతోనే టాలీవుడ్‌లోకీ రీఎంట్రీ ఇస్తోంది. మెగా 157 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడులో సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి యాభై శాతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం.
Also Read – Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు – ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
నాలుగో మూవీ…
కాగా సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న నయనతార నాలుగో తెలుగు మూవీ ఇది. నయనతార తెలుగు డెబ్యూ మూవీ లక్ష్మి సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి అడుగులోనే పెద్ద హిట్‌ను అందుకున్నది నయనతార. ఆ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా లక్ష్మి నిలిచింది. లక్ష్మి తర్వాత 2010లో రిలీజైన ఎన్టీఆర్ అదుర్స్ మూవీతో మరోసారి సంక్రాంతి పండుగకు తెలుగు ప్రేక్షకులను పలకరించింది నయనతార. మాస్ యాక్షన్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లలో ఒకటిగా నిలిచింది. అదుర్స్ మూవీలో చంద్రకళగా ట్రెడిషనల్ రోల్‌లో అదరగొట్టింది నయనతార.
ముచ్చటగా మూడు…
లక్ష్మి,అదుర్స్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ అనంతరం జై సింహాతో ముచ్చటగా మూడోసారి సంక్రాంతి బరిలో నిలిచింది నయన్. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీతో హ్యాట్రిక్ సంక్రాంతి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
Also Read – Janmastami: జన్మాష్టమికి ఈ 5 వస్తువులను ఇంటికి తీసుకురండి..ఫలితాలు కలలో కూడా ఊహించరు!
హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు…
మెగా 157తో సంక్రాంతి హిట్ సెంటిమెంట్‌ను నయన్ కంటిన్యూ చేస్తుందా? లేదా? అన్నది టాలీవుడ్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు చిత్రసీమలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు ఉన్న డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు అతడు చేసిన సినిమాలన్నీ హిట్లే. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ మెగా 157 బిగ్గెస్ట్ ప్లాస్ పాయింట్‌గా మారింది. ఈ మూవీతో నాలుగో సంక్రాంతి హిట్ నయనతార ఖాతాలో పడటం ఖాయమని ఆమె అభిమానులు చెబుతున్నారు మెగా 157 మూవీకి మన వరప్రసాద్ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేసినట్లు సమాచారం. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మెగా 157 మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మెగా 157తో పాటు కన్నడంలో యశ్ టాక్సిక్‌లో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది నయనతార. తమిళంలో నాలుగు, మలయాళంలో మరో రెండు సినిమాలు చేస్తోంది నయనతార.


