Villain Role: హీరోలు.. విలన్ పాత్రల్లో కనిపించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఓ భాషకు చెందిన స్టార్ హీరో సినిమాలో ఇతర భాషలకు చెందిన హీరోలు… విలన్లుగా కనిపిస్తున్నారు. తెలుగు సినిమాల్లో మలయాళం, కన్నడ, తమిళ భాషలకు చెందిన హీరోలు నెగెటివ్ క్యారెక్టర్స్ చేస్తూ అదరగొడుతున్నారు. ఈ ట్రెండ్‌ను ఇప్పుడిప్పుడే తెలుగు హీరోలు ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ ప్రతినాయక పాత్రలపై మనసుపడుతున్నారు. రజనీకాంత్ తమిళ సినిమాల్లో తెలుగు హీరోలు విలన్లుగా కనిపించారు. ఆ సినిమాలు ఏవంటే?
కూలీలో నాగార్జున…
రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీలో మెయిన్ విలన్‌గా టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున కనిపించాడు. సైమన్ పాత్రలో తన విలనిజంతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు నాగార్జున. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా కూలీ మూవీ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. నాగార్జున పాత్రను స్టైలిష్ చూపించడంలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సక్సెస్ అయ్యాడు. కానీ నాగార్జున విలన్ క్యారెక్టర్‌లో డెప్త్ లేకపోవడం, చివరలో ఆయన పాత్రను ముగించిన తీరు పట్ల మాత్రం ఫ్యాన్స్ మాత్రం డిసపాయింట్ అవుతున్నారు. నాగార్జునలోని విలనిజాన్ని పూర్తిస్థాయిలో కూలీ ఆవిష్కరించలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. కమర్షియల్‌గా కూలీ హిట్టవ్వడం అనుమానమేనని చెబుతున్నారు. తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చినా నెగెటివ్ టాక్ కారణంగా రెండో రోజు వసూళ్లు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా కూలీ మూవీ 240 కోట్ల వసూళ్లను ఈ మూవీ రాబట్టింది.
బందిపోటు సింహం…
కూలీ కంటే ముందు రజనీకాంత్ సినిమాల్లో చిరంజీవి, రానా దగ్గుబాటి వంటి స్టార్స్ విలన్స్‌గా కనిపించారు. రజనీకాంత్ రాణువవీరన్ మూవీలో చిరంజీవి విలన్‌గా కనిపించాడు. తెలుగులో బందిపోటు సింహం పేరుతో ఈ మూవీ డబ్బైంది. రెండు భాషల్లో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అప్పటికే హీరోగా ఎస్టాబ్లిష్ అయిన చిరంజీవిని విలన్ పాత్రలో ఆడియెన్స్ చూడలేకపోయారు. కానీ ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం చిరంజీవి మేకోవర్ అయిన తీరుకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. రా అండ్ రస్టిక్ రోల్‌లో మెగాస్టార్ నటించారు…
రానా దగ్గుబాటి…
రజనీకాంత్ వేట్టయాన్‌లో రానా దగ్గుబాటి ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాడు. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలవలేకపోయింది. రజనీకి ధీటుగా రానా విలనిజం పండలేదు. రజనీకాంత్ అన్నాత్తే, లింగా సినిమాల్లో టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు విలన్ క్యారెక్టర్స్ చేశాడు. అన్నాత్తే సినిమాకు సిరుత్తై శివ దర్శకత్వం వహించగా.. లింగా సినిమాను కేఎస్ రవికుమార్ తెరకెక్కించారు. రజనీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌గా ఈ సినిమాలు నిలిచాయి.
Also Read – Ghattamaneni Bharathi: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న మహేష్‌బాబు అన్న కూతురు – డైరెక్టర్ తనయుడితో సినిమా…
రజనీకాంత్ సినిమాల్లో విలన్‌గా నటించి సక్సెస్ కొట్టిన ఒకే ఒక తెలుగు హీరోగా సుమన్ నిలిచాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన శివాజీ సినిమాలో అవినీతి పరుడైన రాజకీయనాయకుడి పాత్రలో టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ కనిపించాడు. ఈ సినిమా పెద్ద హిట్టయ్యింది.


