KGF 3: కన్నడ సినిమా ఇండస్ట్రీలో కేజీఎఫ్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా కన్నడ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో స్థానం సంపాదించుకుంది. ప్రశాంత్ నీల్-యష్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీఎఫ్ ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను రాబట్టి.. సౌత్ సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే, కేజీఎఫ్ సిరీస్‌లో మూడవ భాగం కూడా ఉందని మేకర్స్ వెల్లడించినప్పటికీ, అది ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు.
కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సీక్వెల్స్‌ని మొదలు పెట్టాడు. ఇందులో మొదటి భాగం వచ్చి భారీ హిట్ సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని ప్రశాంత్ నీల్ క్లైమాక్స్ లో ప్రకటించాడు. కానీ, ప్రభాస్ వరుసగా సినిమాలను కమిటవడం వల్ల ఆ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలను చేస్తున్నాడు. 2026, సంక్రాంతికి జనవరి 9న ది రాజాసాబ్ రిలీజ్ కాబోతోంది.
Also Read- Kantara Chapter 1: రిషబ్ శెట్టి టార్గెట్ రూ.1000 కోట్లు.. వంద కోట్ల మార్క్ దాటిన ‘కాంతార చాప్టర్ 1’
అలాగే, హనురాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే, రాజాసాబ్ తర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ 2 చేస్తారని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం ఎన్‌టిర్-నీల్ కాంబోలో డ్రాగన్ సినిమా తెరకెక్కుతోంది. దీని తర్వాత సలార్ 2 సెట్స్ పైకి వస్తుందనుకున్నారు. కానీ, స్పిరిట్ పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్.. ఆ తర్వాత కల్కీ 2 ఉండబోతున్నాయట.
ఈ రెండు సినిమాలు ప్రభాస్ కంప్లీట్ చేయడానికి కనీసం మూడేళ్ళు పడుతుందని టాక్ వినిపిస్తోంది. అందుకే, డ్రాగన్ పూర్తవగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా యష్ తో కేజీఎఫ్ 3 చేయడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతానికి ఇదే కన్‌ఫర్మ్ అని తెలుస్తోంది. చూడాలి మరి, దీనిపై అఫీషియల్‌గా క్లారిటీ ఎప్పుడు వస్తుందో. కాగా, యష్ ప్రస్తుతం టాక్సిక్, రామాయణ సిరీస్ లలో నటిస్తున్నాడు. వీటి తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే కేజీఎఫ్ 3 లో నటించాల్సి ఉంది.
Also Read- Akshay Kumar : న్యూడ్ ఫొటోలు పంపు..బాలీవుడ్ అక్షయ్ కుమార్ 13 ఏళ్ల కుమార్తెకు బెదిరింపులు


