Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభBellamkonda Sai Sreenivas: ముఖేష్ యాడ్ లేకుండా రిలీజ్.. కిష్కింద‌పురితో ఫ‌స్ట్ టైమ్ బెల్లంకొండ ప్ర‌యోగం

Bellamkonda Sai Sreenivas: ముఖేష్ యాడ్ లేకుండా రిలీజ్.. కిష్కింద‌పురితో ఫ‌స్ట్ టైమ్ బెల్లంకొండ ప్ర‌యోగం

Bellamkonda Sai Sreenivas: సినిమా ల‌వ‌ర్స్‌కు ముఖేష్ యాడ్ సుప‌రిచిత‌మే. ఈ యాంటీ స్మోకింగ్‌ యాడ్‌తోనే సినిమాలు మొద‌ల‌వుతాయి. ఈ న‌గ‌రానికి ఏమైంది.. ఓ వైపు నుసి మ‌రోవైపు పొగ అనో.. లేదంటే నా పేరు ముఖేష్.. అంటూనో నో స్మోకింగ్ యాడ్స్ సినిమా ప్రారంభంలో క‌నిపిస్తుంటాయి. థియేట‌ర్‌, టీవీ, ఓటీటీ మాధ్య‌మం ఏదైనా ఈ నో స్మోకింగ్ యాడ్ ఉండాల్సిందే. అయితే ఫ‌స్ట్ టైమ్‌ తెలుగులో ఈ స్మోకింగ్‌ యాడ్ లేకుండా ఓ సినిమా రాబోతుంది. అదే కిష్కింద‌పురి.

- Advertisement -

ఒక్క‌టి కూడా లేదు…
ఈ విష‌యాన్ని సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. కిష్కింద‌పురిలో స్మోకింగ్‌, డ్రింకింగ్ సీన్స్ ఒక్క‌టి కూడా ఉండ‌వ‌ట‌. అందుకే స్మోకింగ్ యాడ్ కూడా లేకుండా సినిమాను రిలీజ్ చేయాల‌ని డైరెక్ట‌ర్ ఫిక్స‌య్యార‌ని బెల్లంకొండ శ్రీనివాస్ పేర్కొన్నారు. “నేను మూవీ ల‌వ‌ర్‌నే. షూటింగ్‌ల నుంచి ఏ మాత్రం ఖాళీ దొరికినా సినిమాలు చేస్తుంటాను. సినిమా మొద‌ల‌య్యే ముందు వ‌చ్చే ముఖేష్ యాడ్ బోర్ కొడుతుంది. కొన్నిసార్లు సినిమాలో న‌టించిన హీరోహీరోయిన్ల కంటే ముఖేష్ పేరే ఎక్కువ‌గా గుర్తుంటుంది. ఈ ముఖేష్ యాడ్ టార్చ‌ర్ నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డానికి ఈ సినిమాలో ఒక్క‌టి కూడా స్మోకింగ్‌, డ్రింకింగ్ సీన్ పెట్ట‌లేదు డైరెక్ట‌ర్‌. ఆ సీన్లు లేన‌ప్పుడు యాడ్ ఎందుక‌ని దానిని కూడా తీసేశాడు.. అని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నాడు.

Also Read – Dhanush: టాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్..

రాక్ష‌సుడు త‌ర్వాత‌…
కిష్కిందపురి మూవీ సెప్టెంబ‌ర్ 12న‌ రిలీజ్ కాబోతుంది. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాక్ష‌సుడు త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌లిసి చేస్తున్న సినిమా ఇది. అంతేకాకుండా వీరిద్ద‌రి కెరీర్‌లో ఫ‌స్ట్ హార‌ర్ మూవీ కూడా దే కావ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ఈ సినిమా సెన్సార్ పూర్త‌యింది. కేవ‌లం రెండు గంట‌ల ఐదు నిమిషాల ర‌న్ టైమ్‌తో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

టైస‌న్ నాయుడు…
కిష్కింద‌పురి సినిమాను షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి నిర్మిస్తున్నారు. చైత‌న్య భ‌ర‌ద్వాజ్‌తో క‌లిసి సామ్ సీఎస్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం కిష్కింద‌పురితో పాటు టైన‌స్ నాయుడు సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ డిసెంబ‌ర్‌లో రిలీజ్ కాబోతుంది.

Also Read – Asia Cup 2025 : హార్దిక్ పాండ్యా న్యూ స్టైలిష్ న్యూ లుక్‌.. దుబాయ్‌లో టీమిండియా!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad