Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKishkindhapuri: బెల్లంకొండ శ్రీనుకి ఇది కూడా పెద్ద సవాలే..

Kishkindhapuri: బెల్లంకొండ శ్రీనుకి ఇది కూడా పెద్ద సవాలే..

Kishkindhapuri: బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి అల్లుడు శ్రీను సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను బాగానే మెప్పించాడు. అయితే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన నెక్స్ట్ మూవీస్ ఏవి కూడా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ రకంగా తెలుగు ఇండస్ట్రీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి నిరాశ ఎదురవుతున్న కారణంగా, బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేశాడు.

- Advertisement -

హిందీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేశాడు. కానీ, ఈ సినిమా అక్కడ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ బాలీవుడ్ లో సినిమా చేయాలనే ప్రయత్నాలను మానుకున్నాడు. తెలుగులో హిట్ అందుకున్న సినిమా రాక్షసుడు. తమిళ రీమేక్ గా రమేశ్ వర్మ రూపొందించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేశారు కూడా. ఇక గత చిత్రం భైరవం తో హీరోకి ఓ హిట్ దక్కింది.

Also Read- Samantha Raj Nidimoru : సమంత – రాజ్ దుబాయ్ ట్రిప్‌.. వీడియో షేర్ చేసిన సామ్!

ఈ క్రమంలోనే సాయి శ్రీనివాస్ కిష్కింధపురి అనే మూవీతో మనముందుకు రాబోతున్నాడు. సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు, ట్రైలర్ కూడా రెడీ అయింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బిజినెస్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. కిష్కింధపురి సినిమా ఆంధ్రాలో 3 కోట్ల బిజినెస్ జరుపుకుందట. అలాగే, నైజాం ఏరియాలో 1.5 కోట్లు, సీడెడ్ లో 1 కోటి రూపాయలు బిజినెస్ జరిగిన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే తెలుగు రాష్ట్రాలలో 6 కోట్ల నెట్ కలెక్షన్లు, 13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది.

ఈ సినిమాకి ఇది తక్కువ టార్గెటే అనుకోవచ్చు. ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం అంత కష్టమేమి కాదు. అయితే, గతకొంతకాలంగా సక్సెస్ లు లేని బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ టార్గెట్ కూడా ఓ ఛాలెంజే అనుకోవాలి. ఒక్క షోకి హిట్ టాక్ వస్తే బ్రేకీవెన్ చాలా ఈజీగా అవుతుంది. అదే టాక్ గనక డివైడ్ గా వస్తేనే రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చూడాలి మరి బెల్లం వారి అబ్బాయికి కిష్కింధపురి మూవీ ఎలాంటి సక్సెస్‌ని ఇస్తుందో.

Also Read- Sobhita Dhulipala: చెఫ్‌గా మారిన అక్కినేని కోడ‌లు – శోభిత వంట‌ల‌పై నాగ‌చైత‌న్య రియాక్ష‌న్ – స‌మంత కంటే బెట‌ర్ అంటూ నెటిజ‌న్ల కామెంట్స్‌!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad