Saturday, November 15, 2025
HomeTop StoriesKishkindhapuri OTT: అఫీషియ‌ల్‌.. ఓటీటీలోకి బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ కిష్కింధపురి - స్ట్రీమింగ్‌ ఎందులో, ఎప్పుడంటే?

Kishkindhapuri OTT: అఫీషియ‌ల్‌.. ఓటీటీలోకి బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ కిష్కింధపురి – స్ట్రీమింగ్‌ ఎందులో, ఎప్పుడంటే?

Kishkindhapuri OTT: కిష్కింధపురి మూవీతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

- Advertisement -

ఓటీటీలోకి…
థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షం కురిపించిన కిష్కింధపురి ఓటీటీలోకి రాబోతుంది. ఈ హార‌ర్ మూవీ అక్టోబ‌ర్ 17న జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. విడుద‌ల తేదీని అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించిన జీ5 ప్లాట్‌ఫామ్‌ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. కిష్కింధపురి టీవీ టెలికాస్ట్ డేట్ కూడా క‌న్ఫామ్ అయ్యింది. అక్టోబ‌ర్ 19న జీ తెలుగు ఛానెల్‌లో ఈ సినిమా ప్ర‌సారం కాబోతుంది.

Also Read- Deepika Padukone: స్టార్ హీరోల బండారం బ‌య‌ట‌పెట్టిన దీపికా ప‌దుకొనె – న‌న్నే టార్గెట్ చేస్తున్నారంటూ కామెంట్స్‌

ప‌ది కోట్ల టార్గెట్‌…
మిరాయ్‌తో పోటీగా సెప్టెంబ‌ర్ 12న కిష్కింధపురి థియేట‌ర్ల‌లో రిలీజైంది. కాన్సెప్ట్‌, హార‌ర్ ఎలిమెంట్స్‌తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్టింగ్ బాగుందంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వ‌చ్చాయి. ప‌ది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన కిష్కింధపురి థియేట‌ర్ల‌లో 25 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. నిర్మాత‌ల‌కు ఐదు కోట్ల వ‌ర‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఓటీటీ, శాటిలైట్ క‌లిపితే ప్రాఫిట్స్ గ‌ట్టిగానే వ‌చ్చిన‌ట్లు టాక్‌. కిష్కింధపురి యాభై కోట్ల మార్కును ఈజీగా దాటుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. కానీ మిరాయ్ జోరు కార‌ణంగా బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ అనుకున్న స్థాయిలో క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకోలేక‌పోయింది.

రాక్ష‌సుడు త‌ర్వాత‌…
రాక్ష‌సుడు త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన మూవీ ఇది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లోనే బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన సినిమాలు ఈ రెండే కావ‌డం గ‌మ‌నార్హం. కిష్కింధపురి సీక్వెల్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కిష్కింధపురి 2 పేరుతో ఈ సీక్వెల్ రాబోతుంది.

Also Read- HBD Rajamouli: రాజ‌మౌళి బ‌ర్త్‌డే – మ‌హేష్‌బాబు స్పెష‌ల్ విషెస్

ఆరు సినిమాలు…
కిష్కింధపురి త‌ర్వాత టైస‌న్ నాయుడు, హైంద‌వ సినిమాలు చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు తుది ద‌శ‌లో ఉన్నాయి. మ‌రోవైపు 2025లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హ‌వా కొన‌సాగుతోంది. ఈ ఏడాది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించిన నాలుగు సినిమాలు రిలీజ‌య్యాయి. మ‌రో రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. బైస‌న్ మూవీతో అక్టోబ‌ర్ 17న తెలుగు, త‌మిళ‌ భాష‌ల ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతుంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad