Bellamkonda srinivas: బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న హారర్ మూవీ కిష్కిందపురి సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం మేకర్స్ రిలీజ్ చేశారు. హారర్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్ భయపెట్టింది. ఘోస్ట్ వాకింగ్ టూర్ పేరుతో ఓ పాడబడ్డ మహాల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా సినిమా కథేమిటో చెప్పేశారు మేకర్స్.
ఘోస్ట్ వాకింగ్ టూర్…
ఊరికి ఉత్తరానా… దారికి దక్షిణాన అంటూ గంభీరమైన వాయిస్‌తో ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్ మొదలైంది. ప్రేతాత్మ.. దాని పరిచయం అంటూ కమెడియన్ భద్రం చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. దయ్యాల మీద క్యూరియాసిటీ ఉన్న వాళ్లందరిని… ఒక దయ్యాల కొంపకు తీసుకెళ్లి… దాని వెనుక ఉన్న కథేమిటి అని చెప్పి… ఆ ప్లాన్ చుట్టూ ఓ వాకింగ్ టూర్ నిర్వహిస్తారు అని భద్రం చెప్పగానే… వెల్‌కమ్ టూ కిష్కిందపురి ఘోస్ట్ వాకింగ్ టూర్ అంటూ అనుపమ పరమేశ్వరన్ డైలాగ్ కంటిన్యూ చేయడం ఆసక్తిని పంచుతోంది.
బతకడానికి అర్హులే కాదు..
బతుకు మీద ఇంత తీపి ఉన్నవాళ్లు బతకడానికి అర్హులే కాదు అనే డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలుస్తోంది. కంప్లీట్ హారర్ ఎలిమెంట్స్‌తో మేకర్స్ ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ చివరలో అనుపమ దయ్యంగా మారి భయపెట్టడం ఉత్కంఠను పంచుతోంది.
Also Read – Vetrimaran: ఇండస్ట్రీ షాకయ్యే నిర్ణయం..
సెన్సార్ కంప్లీట్…
కిష్కిందపురి సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌లో ఫస్ట్ హారర్ మూవీ ఇదే కావడం గమనార్హం. రాక్షసుడు తర్వాత వీరిద్దరు కలిసి చేస్తున్న సెకండ్ మూవీ ఇది. ఈ హారర్ మూవీ సెన్సార్ పూర్తయింది. రెండు గంటల ఐదు నిమిషాల రన్‌టైమ్‌తో కిష్కిందపురి రిలీజ్ కాబోతుంది. రీసెంట్ టైమ్‌లో అతి తక్కువ రన్‌టైమ్‌తో రిలీజ్ అవుతోన్న సినిమా ఇదే కావడం గమనార్హం.
రిలీజ్ పోస్ట్‌పోన్ రూమర్స్…
సెప్టెంబర్ 12న కిష్కిందపురితో పాటు తేజా సజ్జా సూపర్ హీరో మూవీ మిరాయ్ రిలీజ్ కాబోతుంది. మిరాయ్‌తో పోటీ కారణంగా కిష్కిందపురి ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. సెప్టెంబర్ 13న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. ఈ పోస్ట్‌పోన్ రూమర్స్‌ను చిత్రబృందం ట్రైలర్ ద్వారా ఖండించింది.
Also Read – Xi Jinping: శాంతా-యుద్ధమా? చర్చలా-ఘర్షణా? జిన్ పింగ్ సంచలన వ్యాఖ్యలు


