Kishkindhapuri Collections: హిట్టు కొట్టాలనే బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) కల ఆరేళ్ల తర్వాత తీరింది. కిష్కిందపురి మూవీ శుక్రవారం నాటితో బ్రేక్ ఈవెన్ అయ్యింది. థియేటర్లలో రిలీజైన ఎనిమిది రోజుల్లో అన్ని ఏరియాల్లో ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పది కోట్ల వరకు జరిగింది. పదకొండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో కిష్కిందపురి ప్రేక్షకుల ముందుకొచ్చింది. శుక్రవారం నాటితో బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. ఎనిమిదో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 56 లక్షల వసూళ్లను దక్కించుకున్నది.
రాక్షసుడు తర్వాత…
2019లో వచ్చిన రాక్షసుడుతో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను అందుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్, ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కిష్కిందపురితో కెరీర్‌లో సెకండ్ హిట్టు పడింది. ఈ రెండు సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించడం గమనార్హం.
ప్రమోషన్స్‌కు దూరం…
కిష్కిందపురి రెండు, మూడు రోజలు ముందే బ్రేక్ ఈవెన్ కావాల్సింది. కానీ రిలీజ్ తర్వాత సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడం మైనస్‌గా మారింది. రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో కనిపించిన అనుపమ పరమేశ్వరన్… ఆ తర్వాత సక్సెస్ మీట్, థాంక్స్ మీట్‌లో కనిపించలేదు. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి ఎలాంటి పోస్ట్‌లు పెట్టలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు షూటింగ్‌తో బిజీ అయ్యారు. రిలీజ్ తర్వాత సక్సెస్ టూర్, ఈవెంట్స్ చేసుంటే నిర్మాతకు హెల్పయ్యేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Also Read – Ukrainian Couple Hindu Marriage: ఇదెక్కడి లవ్ రా బాబు.. భారతీయం సాంప్రదాయంలో ఒక్కటైన 72 వెడ్స్ 27 జంట..!!
మిరాయ్ పోటీని తట్టుకొని…
కిష్కిందపురికి పోటీగా మిరాయ్ రిలీజ్ కావడం కూడా సినిమాను దెబ్బకొట్టింది. ముందుగా అనుకున్నట్లుగా సోలోగా కిష్కిందపురి రిలీజైతే నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ వచ్చి ఉండేవి. అప్పటికీ మిరాయ్ పోటీని తట్టుకొని కిష్కిందపురి బాక్సాఫీస్ వద్ద గట్టిగానే నిలబడింది. అయినా ఆశించిన మేర నిర్మాతకు లాభాలు రాలేదని అంటున్నారు. మరో ఐదు రోజుల్లో పవన్ కళ్యాణ్ ఓజీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ గ్యాప్ మాత్రమే కిష్కిందపురి మిగిలింది. ఫుల్ థియేట్రికల్ రన్‌లో నిర్మాతలకు ఈ మూవీ ఐదు కోట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓటీటీ, శాటిలైట్ కూడా కొంత గిట్టుబాటు అయినట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నది.
కిష్కిందపురికి సీక్వెల్..
కిష్కింపురి మూవీకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించారు. కిష్కిందపురికి సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్లు సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ ప్రకటించారు.
Also Read – Leg Swelling Troubles: కాళ్ల వాపుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే.


