kishkindapuri: కిష్కిందపురి మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత హిట్టు అందుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది.
థియేటర్లలో అదరగొట్టిన కిష్కిందపురి ఓటీటీలోకి వచ్చేస్తోంది. అక్టోబర్ 17 నుంచి ఈ హారర్ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే కిష్కిందపురి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 దక్కించుకున్నది. నాలుగు వారాల తర్వాతే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురావాలని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో నిర్మాత డీల్ కుదర్చుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారమే అక్టోబర్ మూడో వారంలో కిష్కిందపురి మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
ఐదు కోట్ల వరకు లాభాలు…
బాక్సాఫీస్ వద్ద కిష్కిందపురి మూవీ 25 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. పది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు ఐదు కోట్లకుపైనే లాభాలను తెచ్చిపెట్టింది. థియేటర్లలో కిష్కిందపురితో పాటు తేజ సజ్జా మిరాయ్ ఒకే రోజు రిలీజయ్యాయి. మిరాయ్ పోటీ కారణంగా కిష్కిందపురి హిట్టు టాక్‌తోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. సోలో రిలీజ్ డేట్ దక్కి ఉంటే ఈ సినిమా యాభై కోట్ల వరకు వసూళ్లను రాబట్టి ఉండేది.
Also Read – Viral:’పెళ్లైన రెండో నెలలోనే నాకు అడ్డంగా దొరికిపోయాడు..’ చాహల్‌పై ధనశ్రీ షాకింగ్ కామెంట్స్..
లక్కీ ఛార్మ్…
రాక్షసుడు తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మూవీ ఇది. రెండు సినిమాలు హిట్టుగా నిలవడంతో బెల్లంకొండకు అనుపమ పరమేశ్వరన్ లక్కీ ఛార్మ్‌గా మారింది. కిష్కిందపురి మూవీని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీలో తనికెళ్లభరణి, శాండీ మాస్టర్, హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు.
కిష్కిందపురి కథ ఇదే…
కిష్కిందపురి అనే ఊళ్లోని సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ 1989లో మూతపడుతుంది.ఆ బంగళాలో రాఘవ్, మైథలితో పాటు మరో పదకొండు మంది ఘోస్ట్ వాకింగ్ టూర్ పేరుతో అడుగుపెడతారు. సరదాగా సాగాల్సిన ఆ టూర్ అనుకోని మలుపులు తిరుగుతుంది. ఆ ప్యాలెస్‌లో ఉన్న వేదవతి అనే ఆత్మ ఒక్కొక్కరిని చంపడం మొదలుపెడుతుంది. ఆ ప్యాలెస్ మిస్టరీని రాఘవ్ ఎలా ఛేదించాడు? అక్కడి నుంచి మిగిలిన వారు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు అన్నదే ఈ మూవీ కథ.
కిష్కిందపురి తర్వాత టైసన్ నాయుడుతో పాటు హైందవ అనే సినిమాలు చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.
Also Read – Canada: బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా


