Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న మన టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలెవరూ ఇలా వరుసగా సినిమాలు చేయడం లేదు. ఈ విషయంలో బెల్లంకొండ శ్రీను చాలా బెటర్ అని చెప్పాలి. ఏ హీరోకైనా ఒక్కసారి గట్టిగా బ్రేక్ పడితే కెరీర్ డైలమాలో పడుతుంది. అందుకే, ఆ ఛాన్స్ బెల్లం వారబ్బాయి తీసుకోవడం లేదు. మాస్ అండ్ యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంటెడ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలా జానర్ ఏదైనా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు.
ఆ మధ్య భైరవం అనే సినిమాతో వచ్చి ఆకట్టుకున్నాడు. మల్టీస్టారర్ మూవీగా వచ్చిన ఇందులో బెల్లకొండ శ్రీనివాస్ పర్ఫార్మెన్స్‌కి మంచి ప్రశంసలే దక్కాయి. ఆ తర్వాత కిష్కింధపురి అనే హర్రర్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా కూడా పరవాలేదనిపించింది. కానీ, సాలీడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. అటు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఛత్రపతి రీమేక్ చేసినా కూడా అది ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఈ క్రమంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి మరో రెండు సినిమాలు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో ఒకటి టైసన్ నాయుడు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, బెల్లంకొండ శ్రీనుకి జంటగా నభా నటేశ్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఈ ఇద్దరు హాట్ బ్యూటీస్ ఇది వరకే బెల్లం బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు ఈ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా టైసన్ నాయుడు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
సాగర్ చంద్ర ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘భీమ్లా నాయక్’ లాంటి సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలయికలో సాగర్ చంద్ర ‘భీమ్లా నాయక్’ రూపొందించి మంచి ప్రశంసలు అందుకున్నాడు. అందుకే, ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేస్తున్న టైసన్ నాయుడు సినిమాపై కూడా మంచి బజ్ నెలకొంది. మరి, ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. కాగా, హైందవ అనే మరో సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్నాడు. ఈ మూవీ అప్‌డేట్స్ కూడా రావాల్సి ఉంది.
Also Read- Mahesh Babu: హైదరాబాద్‌లో మహేష్‌బాబు మరో మల్టీప్లెక్స్ థియేటర్ – చిరంజీవి సినిమాతో ఓపెనింగ్


