Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో టాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీలను ఈడీ విచారించింది. తాజాగా బుధవారం ఈడీ విచారణకు మంచు లక్ష్మి హాజరయ్యారు. తన లాయర్‌తో కలిసి ఆమె హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు.
రెమ్యూనరేషన్స్‌పై ఆరాలు…
నిషేదిత బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రమోట్ చేయాల్సివచ్చింది? వాటి నుంచి తీసుకున్న రెమ్యూనరేషన్స్‌తో పాటు ఇతర లావాదేవీలకు సంబంధించి ఈడీ అధికారులు మంచు లక్ష్మిని చాలా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
Also Read – Goa Liberation Day : ఆ రాష్ట్రంలో ఆగస్టు 15న కాదు… డిసెంబర్ 19న స్వాతంత్ర్యం!
నాలుగు గంటల విచారణ…
ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో విజయ్ దేవరకొండను నాలుగు గంటలకుపైగా ఈడీ అధికారులు విచారించారు. ప్రకాష్ రాజ్ విచారణ ఆరు గంటల పాటు సాగింది. రానాను మూడు గంటలకుపైగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. మంచు లక్ష్మిని కూడా దాదాపు మూడు గంటల పాటు విచారించనున్నట్లు తెలిసింది. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో మంచు లక్ష్మి ఏ4గా ఉంది. బెట్టింగ్ యాప్స్ అని తెలియక ప్రమోట్ చేసినట్లు ప్రకాష్‌రాజ్‌తో పాటు పలువురు సెలిబ్రిటీలు విచారణ అనంతరం వ్యాఖ్యానించారు. విజయ్ దేవరకొండ మాత్రం తాను కేవలం గేమింగ్ యాప్‌లను మాత్రమే ప్రమోట్ చేసినట్లు చెప్పాడు. అవి బెట్టింగ్ యాప్‌లు కాదని అన్నాడు. ఈడీ విచారణపై మంచు లక్ష్మి ఎలాంటి కామెంట్స్ చేస్తుందన్నది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల…
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో మంచు లక్ష్మితో పాటు నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, నయని పావని, విష్ణుప్రియతో పాటు పలువురు టాలీవుడ్ హీరోయిన్లు, యాంకర్లకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ 25 మంది సినీ ప్రముఖులపై ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ కేసులో ఏ1గా రానా, ఏ2గా ప్రకాష్ రాజ్, ఏ3గా విజయ్ దేవరకొండ ఉండగా ఏ4గా మంచు లక్ష్మిపై కేసు నమోదైంది.
Also Read – Coolie : ‘కూలీ’ ఫస్ట్ రివ్యూ – ఉదయనిధి స్పందనిదే!
మోహన్‌బాబు తనయగా…
కాగా మోహన్‌బాబు తనయగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి హీరోయిన్‌గా, విలన్‌గా పలు సినిమాలు చేసింది. అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి, చందమామ కథలు, దొంగాట, గుంటూర్ టాకీస్ సినిమాలతో నటిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.


