Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPrabhas: ప్రభాస్ సినిమాలో నటించాలని ఉందా? ఈ అవకాశం మీకోసమే

Prabhas: ప్రభాస్ సినిమాలో నటించాలని ఉందా? ఈ అవకాశం మీకోసమే

సినిమాల్లో నటించాలని అనుకుంటున్నారా..? ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా..? అది కూడా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)సినిమాలో నటించాలని ఆశగా ఉందా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. మీలాంటి ఔత్సాహికుల కోసం భద్రకాళి సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. స్పిరిట్(Spirit) సినిమాలో నటించేందుకు నటీనటులు కావాలని ఎక్స్ ద్వారా ఓ పోస్ట్ చేసింది. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాతగా భద్రకాళి పిక్చర్స్ అనే బ్యానర్ ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

‘‘స్పిరిట్‌లో నటించే అవకాశం అన్ని వయసుల వారికి కల్పిస్తున్నాం. కానీ థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు మాత్రమే అందుకు అర్హులు. ఒక హెడ్ షాట్ షొతోతో పాటు పర్సనల్ షాట్ ఫొటో కూడా జత చేయండి. మీ వివరాలను spirit. bhadrakalipichtures@gmail. comకి పంపండి. అలాగే ఇంట్రడక్షన్ వీడియోను రికార్డ్ చేసి పైన ఇచ్చిన జీ మెయిల్ ఐడికి పంపాలి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉంటే ఓసారి మీరు కూడా ట్రై చేయండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad