Bhagyshri Borse : కొందరు హీరోయిన్ల గ్లామర్, యాక్టింగ్ విషయంలో ఎలాంటి వంక పెట్టలేం. అందంతో ఎంతగా ఆకట్టుకుంటారో…అభినయంతో అదే స్థాయిలో అదరగొడుతుంటారు. ఎటొచ్చి అదృష్టమే కలిసిరాదు. అందుకు భాగ్యశ్రీ బోర్సే నిదర్శనంగా నిలుస్తోంది. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్ సినిమాల్లో గ్లామర్‌తో మెప్పించింది. గ్లామర్ మాత్రమే కాదు యాక్టింగ్‌తోనూ తాను సాటే అని కాంతతో నిరూపించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ పీరియాడికల్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాంత మూవీలో కుమారి అనే సినిమా హీరోయిన్ పాత్రలో భాగ్యశ్రీ నటించింది. నాచురల్ యాక్టింగ్ కనబరిచింది.
కాంత మంచి పేరు తెచ్చిపెట్టిన కమర్షియల్‌గా మాత్రం తొలిరోజే బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. అతి కష్టంగా మొదటిరోజు నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళంలో పాజిటివ్ టాక్ వచ్చినా తెలుగు వెర్షన్‌కు మాత్రం అన్ని చోట్ల నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. అరవై కోట్లకుపైనే బడ్జెట్‌తో ఈ సినిమాను దుల్కర్ సల్మాన్, రానా నిర్మించారు. ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టడం అసాధ్యంగానే కనిపిస్తోంది. కాంతతో భాగ్యశ్రీ బోర్సే ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ చేరిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. ఇక భాగ్యశ్రీ ఆశలన్నీ రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకాపైనే ఉన్నాయని చెబుతున్నారు. కాంత తరహాలోనే సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లోనే ఆంధ్రా కింగ్ తాలూకా రూపొందింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్‌బాబు పి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
ఇందులో మహాలక్ష్మి అనే పల్లెటూరి యువతిగా భాగ్యశ్రీ కనిపించబోతున్నది. కాంత తరహాలోనే ఇది కూడా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రేనట. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటల్లో రామ్, భాగ్యశ్రీ తమ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. అదే మ్యాజిక్ స్క్రీన్‌పై వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. హ్యాట్రిక్ ఫ్లాప్‌ల నుంచి ఈ సినిమాతోనైనా భాగ్యశ్రీ బయటపడుతుందా? లేదా? అన్నది మరో రెండు వారాల్లో తేలనుంది. ఈ సినిమా రిజల్ట్‌పైనే భాగ్యశ్రీ నెక్స్ట్ సినిమాల ఛాన్స్‌లు ఆధారపడి ఉన్నాయి.


