Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే చాలా తక్కువ టైమ్‌లోనే యువతరం ఆరాధ్యనాయికగా మారిపోయింది. టాలీవుడ్‌లో ఈ అమ్మడికి ఆఫర్లకు కొదవలేదు. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఎటొచ్చి సక్సెస్ మాత్రం ఇప్పటివరకు దక్కలేదు. హీరోయిన్‌గా నటించిన రెండు తెలుగు సినిమాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి.
మిస్టర్ బచ్చన్‌తో ఎంట్రీ…
మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో తన అందాలతో యూత్ ఆడియెన్స్‌ను ఫిదా చేసింది భాగ్యశ్రీ. కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయినా భాగ్యశ్రీ లోని గ్లామర్ యాంగిల్‌ను టాలీవుడ్‌కు ఈ మూవీ పరిచయం చేసింది. మిస్టర్ బచ్చన్ తర్వాత అనూహ్యంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. డేట్స్ కారణంగా శ్రీలీల కింగ్డమ్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీ కథానాయికగా సినిమాలోకి అడుగుపెట్టింది.
Also Read- Viral Video: ఓ పక్క గణేశుడి మెడలో నాగుపాము.. మరో పక్క వినాయకుడి ఒడిలో హాయిగా నిద్రపోతున్న పిల్లి..
బాక్సాఫీస్ వద్ద బోల్తా…
తొలి సినిమాతో మిస్సయిన సక్సెస్..కింగ్డమ్‌తో తప్పకుండా దక్కుతుందని భాగ్యశ్రీ భావించింది. కానీ ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కమర్షియల్‌గానే కాకుండా యాక్టింగ్ పరంగా కింగ్డమ్ భాగ్యశ్రీకి ఏ మాత్రం ఉపయోగపడలేకపోయింది. కింగ్డమ్‌లో భాగ్యశ్రీ బోర్సే గట్టిగా ఇరవై నిమిషాలు కూడా కనిపించదు. అందులోనూ పెద్దగా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ చేసింది. లెంగ్త్ ఎక్కువవుతుందనే ఆలోచనతో భాగ్యశ్రీ సీన్స్‌ను చాలా వరకు ఎడిటింగ్‌లో లేపేశారు మేకర్స్. చివరకు.. సూపర్ హిట్టైన హృదయం లోపల సాంగ్ కూడా అటు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కనిపించలేదు. కింగ్డమ్‌లో తన క్యారెక్టర్‌ను ఆవిష్కరించిన తీరు పట్ల భాగ్యశ్రీ హర్టయినట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా చెప్పింది ఒకటి…కానీ స్క్రీన్‌పై చూపించింది మరోటి అంటూ భాగ్యశ్రీ ఆవేదనను వ్యక్తం చేసినట్లు చెబుతోన్నారు. కింగ్డమ్ రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా కనిపించిన భాగ్యశ్రీ.. విడుదల తర్వాత అందుకే సైలెంట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం భాగ్యశ్రీ ఆశలన్నీ ఆంధ్రా కింగ్ తాలూకాపైనే ఉన్నాయి. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ మూవీ నవంబర్ 28న రిలీజ్ కాబోతుంది. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో మహాలక్ష్మి అనే ట్రెడిషనల్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నది భాగ్యశ్రీ. గత రెండు సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ సాగుతుందట. ఇందులో భాగ్యశ్రీ బోర్సే రోల్ లెంగ్త్ ఎక్కువేనట. యాక్టింగ్ పరంగా భాగ్యశ్రీలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ ఈ మూవీతోనైనా భాగ్యశ్రీకి దక్కుతుందో లేదో చూడాల్సిందే.
Also Read- Nivetha Pethuraj: పెళ్లిపీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్ – కాబోయే భర్త ఎవరంటే?


