బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘భైరవం'(Bhairavam) సినిమా నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో సీనియర్ నటి జయసుధతో పాటు బెల్లంకొండ, మనోజ్, రోహిత్.. ముగ్గురు హీరోయిన్స్ ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్ళైలు ఉన్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే జయసుధకు ముగ్గురు కొడుకులు అని అర్థమవుతోంది. ఇందులో నారా రోహిత్‌కి జంటగా దివ్య పిళ్ళై, శ్రీనివాస్‌కు జోడిగా అదితి శంకర్, మనోజ్ జోడిగా ఆనంది నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని నాంది, ఉగ్రం.. లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు తీసిన విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె. రాధా మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.