Bigg Boss Season 9:బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం ముగిసేసరికి తొలి ఎలిమినేషన్ కూడా పూర్తయ్యింది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బయటకు వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచింది. ప్రారంభం నుంచే ఆటలో శ్రష్టి ప్రత్యేకంగా ఆకట్టుకోలేకపోయింది. ప్రేక్షకుల ఓట్లలోనూ సరైన సపోర్ట్ దక్కకపోవడంతో ఆమె ప్రయాణం ఇక్కడితో ముగిసింది.
కొంతమందికి క్లాస్..
వారాంతం శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌కు క్లాస్ ఇచ్చారు. సభ్యుల ఆటతీరుపై ఆయన కొందరికి హెచ్చరికలు జారీ చేశారు. బాక్స్ బద్దలు కొడతా అంటూ కొంతమందికి క్లాస్ పీకారు. ఆ సందర్భంలో మనీష్, ప్రియ ఎక్కువగా టార్గెట్ అయ్యారు. శ్రష్టి వర్మ ఆపిల్ అడిగినప్పుడు ఇవ్వలేని మీరు రాము రాథోడ్‌కి అరటిపళ్లు ఎలా ఇచ్చారంటూ నాగ్ ప్రియను ప్రశ్నించారు. వెంటనే ప్రియ మర్చిపోయానని సమాధానం ఇవ్వగా, మీరు డాక్టర్ కదా.. గుర్తు పెట్టుకోకపోతే మందులు వేసుకోవాలని వ్యాఖ్యానించారు నాగార్జున.
మిరాయ్ సినిమా ప్రమోషన్స్..
ఆదివారం ఎపిసోడ్‌లో వాతావరణం కాస్త భిన్నంగా సాగింది. మిరాయ్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో తేజ సజ్జ, హీరోయిన్ రితిక నాయక్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఇద్దరూ కంటెస్టెంట్స్‌తో గేమ్స్ ఆడించారు, డాన్స్ చేయించారు. హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత సరదాగా ఎంటర్‌టైన్ చేశారు.
హౌస్‌మేట్స్‌కి కొత్త టాస్క్..
అదే సమయంలో నాగార్జున హౌస్‌మేట్స్‌కి కొత్త టాస్క్ ఇచ్చారు. టెనెంట్స్‌గా ఉన్న తొమ్మిది మందిలో ఒకరికి పర్మినెంట్ ఓనర్ అవ్వడానికి అవకాశం ఇవ్వబోతున్నామని చెప్పారు. రెడ్ టీమ్, బ్లూ టీమ్‌లుగా విడదీసిన బిగ్ బాస్.. ప్రతి టీమ్‌లో ఒకరు సంచలక్‌గా ఉండాలని నియమం పెట్టాడు. సంచలక్‌గా ఉండే వ్యక్తికి ఓనర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదని ప్రకటించారు. రెడ్ టీమ్‌లో భరణి, రాము రాథోడ్, శ్రష్టి వర్మ, తనుజ ఉండగా.. బ్లూ టీమ్‌లో సంజన, ఇమ్మానుయేల్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి ఉన్నారు. ఫ్లోరా షైనీని సంచలక్‌గా నియమించారు.
బ్యాలెట్ బాక్స్‌లో..
కన్వేయర్ బెల్టుపై వచ్చే పేపర్లపై స్టాంప్ వేసి వాటిని బ్యాలెట్ బాక్స్‌లో వేయాలన్నది టాస్క్ రూల్. ఒకరు పేపర్ తీసుకోవాలి, ఒకరు స్టాంప్ వేయాలి, ఇంకొకరు బాక్స్‌లో వేసేలా ప్లాన్ చేశారు. అదేవిధంగా ప్రత్యర్థి టీమ్‌ను అడ్డుకోవచ్చని బిగ్ బాస్ చెప్పడంతో టాస్క్ మరింత ఆసక్తికరంగా మారింది.
Also Read: https://teluguprabha.net/health-fitness/walking-mistakes-that-reduce-health-benefits/
బజార్ మోగగానే హౌస్‌లో రచ్చ మొదలైంది. రెడ్ టీమ్ తరఫున భరణి ముందుకొచ్చి బ్లూ టీమ్ సభ్యులను అడ్డుకునేందుకు శక్తివంతంగా ప్రయత్నించాడు. ఇమ్మానుయేల్, రీతూ చౌదరిని ఆపేందుకు పట్టేశాడు. ఈలోపు బ్లూ టీమ్‌లో సంజన చేసిన పొరపాటు పెద్దగా దృష్టిని ఆకర్షించింది. ఆమె వేసిన పేపర్లు బాక్స్‌లో పూర్తిగా పడకపోవడంతో రెడ్ టీమ్‌లోని తనుజ వాటిని తీసి బయటకు పడేశారు.
రెడ్ టీమ్ విజయం..
ఫలితంగా చివరికి రెడ్ టీమ్ విజయం సాధించింది. నాగార్జున రెడ్ టీమ్ నుంచి ఒకరు ఓనర్ అవుతారని ప్రకటించారు. అయితే ఎవరు అవ్వాలి అన్నది బ్లూ టీమ్, సంచలక్ ఫ్లోరా నిర్ణయించాలని చెప్పారు. ఫ్లోరా మాత్రం శ్రష్టి వర్మను సూచించగా, బ్లూ టీమ్ సభ్యులు భరణికి ఓటు వేశారు. మెజార్టీ ఓట్లతో భరణి పర్మినెంట్ ఓనర్‌గా నిలిచాడు.
భరణి ఎంపికైన తర్వాత నాగార్జున అతనికి ఓ పవర్ ఇచ్చారు. అసిస్టెంట్‌గా ఒకరిని ఎంపిక చేసుకోవాలని చెప్పారు. దాంతో భరణి తనుజను తన సహాయకురాలిగా ఎంచుకున్నాడు.


