BiggBoss Season 9: బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా షో ప్రారంభం ఘనంగా జరిగింది. ఇప్పటికే ప్రమోస్ ద్వారా నాగార్జున ఈ సీజన్‌లో కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీల మధ్య పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. హౌస్ ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో రెడీ అయింది. రెండు వేర్వేరు హౌస్‌లు ఉండబోతున్నాయని, ఆట మొదట్నుంచే క్లాస్‌గా కాకుండా మాస్‌గా ఉండబోతుందని నాగ్ చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యాయి.
తొలి రోజు నుండి హౌస్‌లో..
మొదటి ఎపిసోడ్ ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రేక్షకులు ఊహించినట్టే తొలి రోజు నుండి హౌస్‌లో వాగ్వాదాలు మొదలయ్యాయి. షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. వీరిలో 9 మంది సెలబ్రిటీలు కాగా, 6 మంది కామన్ కంటెస్టెంట్లు. మొదటి ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ పరిచయాలతో పాటు బిగ్ బాస్ ఇచ్చిన పనులు చుట్టూ ఎక్కువగా చర్చ సాగింది.
హాస్యపూరిత వ్యాఖ్యలతో..
ఉదయాన్నే హౌస్‌లో పాట మోగడంతో అందరూ ఉత్సాహంగా డ్యాన్స్ చేసి రోజూ మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ ప్రదర్శిస్తూ సరదాగా గడిపారు. ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్ తన హాస్యపూరిత వ్యాఖ్యలతో అందర్నీ నవ్వించాడు. అయితే ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ సేపు నిలువలేదు. బిగ్ బాస్ ఇచ్చిన పనుల వల్లే హౌస్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
బ్యాడ్జులు పెట్టి పనులు..
బిగ్ బాస్ సూచనల ప్రకారం కంటెస్టెంట్లు ఒకరికొకరు బ్యాడ్జులు పెట్టి పనులు కేటాయించుకోవాలి. ఈ ప్రక్రియలో ఎవరు ఏ పని చేయాలి అనే విషయంపై చర్చ మొదలైంది. పవన్ రీతూ చౌదరికి క్లీనింగ్ బాధ్యత ఇచ్చాడు. మొదట్లో ఆమె కూడా సానుకూలంగానే స్పందించింది. కానీ వెంటనే క్లీనింగ్ అంటే ఏమేమి చేయాలి అన్న సందేహం వ్యక్తం చేసింది. స్టౌవ్ కూడా క్లీన్ చేయాలా అని రీతూ అడిగిన వెంటనే హౌస్‌లో వాతావరణం మారిపోయింది.
ఈ ప్రశ్నపై హరీష్ స్పందిస్తూ క్లీనింగ్ అంటే కిచెన్ టేబుల్ నుంచి అన్ని వస్తువులు వస్తాయని అన్నాడు. వంట చేసే వారు క్లీనింగ్ చేయరని, ఒకరే వంట చేస్తారని ప్రియ కూడా తన అభిప్రాయం చెప్పింది. దీంతో ఖాళీగా ఉన్న సంజనా క్లీనింగ్ చేస్తే బాగుంటుందని హరీష్ సూచించాడు. కానీ ఈ మాట మనీష్‌కు నచ్చలేదు. అతను వెంటనే మధ్యలో కలగజేసుకుని హరీష్ చెప్పింది సరికాదని అభిప్రాయం తెలిపాడు.
నీకు బ్యాడ్జ్ రాలేదు కదా..
ఇదే విషయంపై హరీష్ ఆగ్రహంతో స్పందించాడు. “నీకు బ్యాడ్జ్ రాలేదు కదా, కాబట్టి జోక్యం చేసుకోవద్దు” అని అన్నాడు. దీనికి మనీష్ కౌంటర్ ఇచ్చి వాదన కొనసాగించాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరుగుతుండటంతో భరణి పరిస్థితిని కూల్ చేయడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ హరీష్ వెనక్కి తగ్గలేదు. “ఏదైనా జరిగితే నేనే చూసుకుంటా, అవసరమైతే ఇల్లు వదిలి వెళ్లిపోతా” అని స్పష్టంగా చెప్పాడు.
మొదటి రోజే ఇంతటి వాగ్వాదాలు జరగడంతో షో ఎలా ముందుకు సాగుతుందో అన్న ఆసక్తి పెరిగింది. ఈ ఘర్షణలో ఎక్కువగా కిచెన్ పనులే హైలైట్ అయ్యాయి. క్లీనింగ్ పనులలో స్పష్టత లేకపోవడం వల్ల హౌస్‌లోని సభ్యులు ఒకరిపై ఒకరు సీరియస్ అయ్యారు. ప్రియ చెప్పిన “కుక్ చేసే వారు క్లీనింగ్ చేయరు” అన్న వ్యాఖ్య కూడా వివాదానికి మరింత ఊతమిచ్చింది.
Also Read: https://teluguprabha.net/cinema-news/asha-saini-enters-bigg-boss-telugu-9-as-second-contestant/
ఇక రీతూ చౌదరి తన బాధ్యతపై స్పష్టత కోరడం సహజమే అయినప్పటికీ, అది హౌస్‌లోని ఇతర సభ్యుల మధ్య విభేదాలకు కారణమైంది. పవన్ మాత్రం తాను కేటాయించిన పనులే అనుసరించాలనే అభిప్రాయంతో నిలబడ్డాడు. కానీ మిగతావారు ఒక్కొక్కరూ తమ కోణంలో మాట్లాడటంతో వాగ్వాదాలు కొనసాగాయి.
ఈ పరిస్థితిని గమనించిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో స్పందించారు. “మొదటి రోజే హౌస్‌లో గొడవలు రావడం అంటే ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండబోతోందన్న సంకేతం” అని కామెంట్లు చేశారు. అలాగే కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీల మధ్య ఘర్షణలు ప్రధానంగా ఉంటాయని నాగార్జున ముందే చెప్పడం ఇప్పుడు నిజమవుతోందని పలువురు పేర్కొన్నారు.


