Bigg Boss 9 Telugu Contestants: బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నీ భాషల్లోనూ ఈ షోకు ఉన్న క్రేజే వేరు. తెలుగు విషయానికి వస్తే ఇప్పటికే 8 సీజన్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలోనే 9వ సీజన్ స్టార్ట్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు సెప్టెంబర్ 7 నుంచి తెలుగులో బిగ్‌బాస్ సీజన్9 ప్రారంభం కానుంది. మరోసారి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. తనదైన బాణీలో ఆయన ఈ షోకు ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెట్టారనటంలో సందేహం లేదు.
సెప్టెంబర్7 నుంచి బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ షురూ కానుండటం అనేది అభిమానుల్లో జోష్‌ను నింపుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సీజన్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేలా నిర్వాహకులు సైతం ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని సమాచారం. ఇప్పటికే బిగ్‌బాస్9 తెలుగు ఈ సీజన్‌లో ఎలా ఉండాలి.. ప్రోమో కోసం ఏం చేయాలనే ప్లానింగ్ వేసుకుంటున్నారు. మరోవైపు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టబోయే సభ్యులు ఎవరెవరుండాలి? అనే దానిపై కూడా వారు చర్చింది. ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చేశారని అంటున్నారు. అందులో భాగంగా కంటెస్టెంట్స్ ను కాంటాక్ట్ చేసి ఇప్పటికే ఫైనల్ చేశారని టాక్.
బిగ్‌బాస్9 తెలుగు కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వినిపిస్తోన్న వార్తల మేరకు ఈ సీజన్‌లో ఆర్టిస్ట్ నవ్యస్వామి, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, సీరియల్ నటి డెబ్జానీ, నటుడు ముఖేష్ గౌడ్, ఛత్రపతి శేఖర్, నటుడు సాయి కిరణ్, యూట్యూబర్ శ్రావణి శర్మ, బమ్‌చిక్ బబ్లు, ఆర్.జె.రాజ్, శ్రావణి వర్మ, జ్యోతిరాయ్, నిఖిల్ లవర్‌గా పాపులర్ అయిన కావ్య, ఈ మధ్య పబ్ వివాదంలో భాగమైన కల్పికా గణేష్, సీరియల్ నటి తేజస్విని తదితరులు సహా మరికొంత మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈసారి పేర్లు చూస్తుంటే బిగ్‌బాస్ హౌస్ మరింత ఎంటర్‌టైనింగ్‌గా, డ్రామా, వివాదాలతో నిండిపోతుందనేది తెలుస్తోంది.
తెలుగులో బిగ్‌బాస్ తొలి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, సెకండ్ సీజన్‌కు నాని వ్యాఖ్యాతగా పని చేశారు. వీరిద్దరూ తమ పనుల కారణంగా తదుపరి సీజన్స్‌ను కంటిన్యూ చేయలేకపోయారు. దీంతో నిర్వాహకులు నాగార్జునను సంప్రదించటం, ఆయన ఓకే చెప్పటం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి ఈ షోకు నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళుతున్నారు.