Bigg Boss 9 Telugu: కొత్త రూల్స్, కొత్త కంటెస్టెంట్స్‌తో తెలుగు ప్రేక్షకులకు అలరించేందుకు బిగ్‌బాస్ సీజన్ 9 సిద్ధమవుతోంది. మరోసారి బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా నాగార్జుననే (Nagarjuna Akkineni) కన్ఫామ్ చేసింది స్టార్ మా. ఇటీవలే ఆఫీషియల్‌గా ప్రకటించింది. నాగార్జున ప్లేస్‌లో మరో టాలీవుడ్ స్టార్ హోస్ట్‌గా షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది. బిగ్‌బాస్ సీజన్ 8 సక్సెస్‌తో మరోసారి నాగార్జుననే హోస్ట్‌గా కంటిన్యూ చేయాలని స్టార్ మా ఫిక్సైంది.
సెప్టెంబర్‌లో లాంఛ్…
సెప్టెంబర్‌లో బిగ్‌బాస్ సీజన్ 9 లాంఛ్ కాబోతుంది. బిగ్‌బాస్ సీజన్ 8లో చాలా వరకు టీవీ, సోషల్ మీడియా సెలిబ్రిటీలే కనిపించారు. కానీ బిగ్‌బాస్ సీజన్ 9లో సామాన్యులకు ఛాన్స్ ఇవ్వబోతున్నారు. ఈ సారి హౌజ్‌లోకి సెలబ్రిటీలే కాదు… మీకు అవకాశం ఉంది వచ్చేయండి బిగ్‌బాస్ 9 తలుపులు తెరిచి మీ కోసం ఎదురుచూస్తున్నాయి అంటూ నాగార్జున స్వయంగా ప్రకటించిన ఓ వీడియోను స్టార్ మా ఇటీవల అభిమానులతో పంచుకున్నది. ఒకరు లేదా ఇద్దరు సామాన్యులకు బిగ్‌బాస్ సీజన్ 9లో పార్టిసిపేట్ చేసే అవకాశం స్టార్ మా కల్పించవచ్చని ప్రచారం జరుగుతోంది.
Also Read – Dhanashree Verma: వానా కాలంలో అందాల వేడి పుట్టిస్తున్న ధనశ్రీ వర్మ
కంటెస్టెంట్స్ వీళ్లే…
కామన్ మ్యాన్స్ మినహా బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరన్నది దాదాపు కన్ఫామ్ అయినట్లు సమాచారం. టీవీ సీరియల్, జబర్ధస్థ్ కంటెస్టెంట్స్‌తో పాటు కొందరు సినిమా యాక్టర్స్ కూడా ఈసారి బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు చెబుతోన్నారు.
గుప్పెడంత మనసు ఫేమ్..
గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ముఖేష్ గౌడ కంటెస్టెంట్‌గా సెలెక్ట్ అయినట్లు సమాచారం. అతడితో పాటు ఇదే సీరియల్‌లో నటించిన సీనియర్ హీరో కమ్ సీరియల్ యాక్టర్ సాయికిరణ్ కూడా షోలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది. గుప్పెడంత మనసు సీరియల్‌లో తండ్రీకొడుకులుగా వీరిద్దరి బాండింగ్ బాగా వర్కవుట్ అయ్యింది. అదే ఎమోషనల్‌ను హౌజ్‌లోనూ కంటిన్యూ చేయించాలని మేకర్స్ భావిస్తోన్నట్లు సమాచారం.
సీరియల్ హీరోయిన్లు…
సీరియల్ హీరోయిన్లు తేజస్విని గౌడ, దేబ్జానీ మోదక్, నవ్యస్వామి కూడా హౌజ్‌మేట్స్‌గా బిగ్‌బాస్ ఫ్యాన్స్‌ను అలరించనున్నారని చెబుతోన్నారు. జబర్ధస్థ్ కమెడియన్ ఇమాన్యుయేల్‌తో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రీతూ చౌదరి కంటెస్టెంట్స్‌గా ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలిసింది. హీరో సుమంత్ అశ్విన్ తో పాటు సీరియల్ యాక్టర్ శివకుమార్ కూడా బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
Also Read – Shubhanshu Shukla: భూమిపైకి తిరిగొచ్చిన శుభాంశు శుక్లా.. ప్రధాని మోదీ హర్షం
హయ్యెస్ట్ రెమ్యూనరేషన్…
అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీతో ఇటీవల బాగా పాపులర్ అయిన రమ్య మోక్షకు బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతోన్నారు. రెమ్యూనరేషన్ పరంగా టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా రమ్య మోక్ష బిగ్‌బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతోన్నారు. వీరితో పాటు కంటెస్టెంట్స్‌గా మరికొందరు సోషల్ మీడియా, టీవీ, సీరియల్ స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి.


