Bigg Boss 9: బిగ్‌బాస్ 9 లాంఛ్ ఎప్పుడనే సస్పెన్స్‌కు తెరపడింది. సెప్టెంబర్ 7 నుంచి ఈ బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో మొదలు కాబోతున్నట్లు స్టార్ మా ప్రకటించింది. ఓ స్పెషల్ ప్రోమోను గురువారం రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో నాగార్జునతో పాటు టాలీవుడ్ కమెడియన్ వెన్నెలకిషోర్ కనిపించారు. బిగ్‌బాస్‌లో పాల్గొనడానికి వచ్చిన వెన్నెలకిషోర్‌కు కండీషన్స్ మీద కండీషన్స్ చెప్పి నాగార్జున భయపెట్టినట్లుగా ప్రోమోలో చూపించారు.
రెండు హౌజ్‌లు…
ఈ సారి బిగ్‌బాస్‌లో రెండు హౌజ్‌లు ఉండబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఒకటి సెలిబ్రిటీల కోసం మరొకటి కామన్ మ్యాన్స్ కోసం ఉండనున్నట్లు తెలుస్తోంది. కామన్‌మ్యాన్స్, సెలిబ్రిటీలు కలిసి ఆడుతారా అని వెన్నెలకిషోర్ అడగ్గా… ఆడుతారో… ఆడుకుంటారో చూద్దాం అంటూ ప్రోమోలో నాగార్జున బదులిచ్చారు.
బిగ్‌బాస్‌నే మార్చేద్దాం…
ఈ సారి బిగ్‌బాస్‌నే మార్చబోతున్నట్లు ప్రోమో చివరలో నాగార్జున ప్రకటించడం ఆసక్తిని పంచుతోంది. బిగ్‌బాస్ షోలో ఇన్నాళ్లు వినిపించిన బేస్ వాయిస్ బదులు కొత్త గొంతు వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. అందరి సరదాలు తీరిపోతాయి… ఈసారి చదరంగం కాదు… రణరంగమే అని నాగార్జున చెప్పడం ప్రోమోకు హైలైట్‌గా నిలుస్తోంది.
Also Read – Balakrishna: అఫీషియల్.. బాలకృష్ణ అఖండ 2 పోస్ట్‌పోన్.. కారణం ఇదే!
కామన్ మ్యాన్స్…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో సెలిబ్రిటీలతో పాటు ఐదుగురు కామన్‌మ్యాన్స్ పాల్గొనబోతున్నారు. ఈ కామన్ మ్యాన్స్ సెలెక్షన్ కోసం బిగ్‌బాస్ అగ్ని పరీక్ష పేరుతో కొత్త షోను నిర్వహకులు రన్ చేస్తున్నారు. శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు నవదీప్, అభిజీత్, బిందుమాధవి జడ్జీలుగా ఉన్నారు. జియో హాట్ స్టార్‌లో బిగ్‌బాస్ అగ్నిపరీక్ష స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 5న బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టే కామన్‌మ్యాన్స్ ఎవరన్నది ఫైనల్ కానున్నట్లు తెలిసింది.
సీనియర్ హీరోయిన్లు…
కాగా బిగ్‌బాస్‌లో పాల్గొనబోయే సెలిబ్రిటీలకు సంబంధించి రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుంది. సీనియర్ హీరోయిన్లు ఆశాశైనీ, సంజన గల్రానీతో పాటు కొరియోగ్రాఫర్ శ్రేష్టివర్మ, సీరియల్ నటి తనూజ గౌడ, జబర్ధస్థ్ ఇమాన్యుయేల్‌తో పాటు మరికొందరు ఫైనల్ అయినట్లు సమాచారం.
కాగా బిగ్‌బాస్‌కు వరుసగా ఏడోసారి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. బిగ్‌బాస్ సీజన్ 3 నుంచి నాగార్జుననే హోస్ట్‌గా కొనసాగుతున్నారు.
Also Read – Delhi: కారుతో ఢీకొట్టి.. 600 మీటర్లు ఈడ్చకెళ్లిన ఘటన.. బాలుడు అరెస్టు


