Biggboss Telugu 9: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఆరంభానికి ముహూర్తం కుదిరింది. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోకు వరుసగా ఏడో సారి హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే బిగ్‌బాస్ హౌజ్ సెట్‌తో పాటు కంటెస్టెంట్స్ ఎంపిక మొత్తం పూర్తయినట్లు సమాచారం. అంతే కాకుండా బిగ్‌బాస్ లాంఛింగ్ డేట్‌ను కూడా స్టార్ మా ఖరారు చేసేసిందట.
లాంఛింగ్ డేట్ ఇదే…
సెప్టెంబర్ 7వ తేదీన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతున్నట్లు చెబుతోన్నారు. ఈ లాంఛింగ్ ఈవెంట్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఖర్చుతో ఓ స్పెషల్ సెట్‌ను మేకర్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బిగ్‌బాస్ 9 లాంఛింగ్ ఈవెంట్‌కు పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీలు గెస్ట్‌లుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ 9కు నాగార్జున ప్లేస్‌లో కొత్త హోస్ట్ రానున్నట్లు ప్రచారం జరిగింది. సీజన్ 8 బిగ్గెస్ట్ సక్సెస్‌తో మరోసారి హోస్ట్‌గానే నాగార్జుననే కంటిన్యూ చేసింది స్టార్ మా.
Also Read- BVS Ravi: బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గొడవలు – క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ రైటర్
కొత్త రూల్స్…
గత సీజన్స్‌కు భిన్నంగా కొత్త రూల్స్, గేమ్స్‌తో బిగ్‌బాస్ 9 ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలిమేషన్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో చాలా మార్పులు చేయబోతున్నట్లు తెలిసింది. బిగ్‌బాస్ విన్నర్ ప్రైజ్‌మనీ భారీగా పెరగనున్నట్లు తెలిసింది. గతంలో యాభై లక్షల ప్రైజ్‌మనీ ఉండేది. ఇప్పడు ఎంత వరకు పెరగనుందన్నది ఆసక్తికరంగా మారింది.
కామన్ మ్యాన్స్ కూడా…
కాగా బిగ్‌బాస్ సీజన్ 9కు సంబంధించి ఇప్పటికే కంటెస్టెంట్స్‌ను ఫైనల్ చేసినట్లు తెలిసింది. సినిమా, టీవీ యాక్టర్స్‌తో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కొందరు స్టార్స్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది. ఒకరిద్దరు కామన్ మ్యాన్స్ కూడా ఈ సారి బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేయనున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ సోషల్ మీడియాలో కొందరు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లనే స్టార్ మా దాదాపు కన్ఫామ్ చేసినట్లు సమాచారం. ఈ లిస్ట్‌లో ఎవరు ఉన్నారంటే?
1…తేజస్వి గౌడ
2…ఇమ్మాన్యుయేల్
3…సుమంత్ అశ్విన్
4…కల్పిక గణేష్
5…ముఖేష్ గౌడ
6…సాయికిరణ్
7…జ్యోతిరాయ్
8…అలేఖ్య చిట్టి…
వీరితో పాటు రేఖ భోజ్, శ్రావణి వర్మ, దేబ్జానీ మోదక్, రీతూ చౌదరి, ఏక్‌నాథ్, హరిక, శ్రీకాంత్, దీపికలకు కంటెస్టెంట్స్‌గా ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read- Pinarayi Vijayan: ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి జాతీయ అవార్డు.. అవమానం అన్న సీఎం


