Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభBiopic: సౌరబ్ గంగూలి బయోపిక్, దాదాగా రణబీర్ కపూర్

Biopic: సౌరబ్ గంగూలి బయోపిక్, దాదాగా రణబీర్ కపూర్

సెలబ్రిటీల్లో ఎక్కువ మందికి బయోపిక్, బయోగ్రఫీలపై ఇంట్రెస్ట్ ఎక్కువ. కొన్నేళ్ల క్రితమే క్రికెటర్ ఎంఎస్ ధోని తన బయోగ్రఫీని సొంతంగా ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఓవైపు రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ బయోపిక్ పై రాద్ధాంతం సాగుతోంది. మనదేశంలో కూడా కపిల్ దేవ్, మిథాలీ రాజ్ వంటి వారి బయోపిక్స్ గతేడాది రిలీజ్ అయ్యాయి. అయితే ఇవి హిట్టా, ఫట్టా అన్నదానితో సంబంధం లేకుండా సెలబ్స్ తమ రియల్ లైఫ్ ను రీల్ పై చూసుకోవటంపై క్రేజ్ చూపుతున్నారు.

- Advertisement -

ఈ లిస్ట్ లో చేరారు సౌరబ్ గంగూలీ కూడా. తన బయోపిక్ పై స్వయంగా స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేసే పనిలో దాదా బిజీగా ఉన్నారు. 2021లోనే దాదా బయోపిక్ పై ప్రకటన వెలువడగా అప్పటి నుంచీ స్క్రిప్ట్ పనులు సాగుతూ ఇప్పుడు స్క్రిప్ట్ లాక్ చేసే స్టేజ్ కి వచ్చింది.

సౌరబ్ చెప్పిన కథంతా విన్న రైటర్ కథను ఫినిష్ చేయగా ఇప్పుడు దాన్ని దాదా ఓకే చేస్తే సెట్స్ పైకి వెళ్తుంది. మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన సౌరబ్ కథ త్వరలో తెరకెక్కుతుందన్నమాట. సూపర్ స్టార్ రణబీర్ కపూర్ సౌరబ్ పాత్ర పోషించే అవకాశాలు దాదాపు కన్ఫర్మ్ అయ్యాయి.

ఇప్పటికే క్రికెటర్ ఝులన్ గోస్వామీ బయోపిక్ రెడీ కాగా ఈ సినిమాలో ఝులన్ గా అనుష్కా శర్మ పోషిస్తున్నారు. పీవీ సింధూ బయోపిక్ కూడా త్వరలో తెరకెక్కే ఛాన్స్ ఉండగా దీపికా పదుకున్ పీవీ సింధూ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది. సైనా నెహ్వాల్ బయోపిక్ రిలీజ్ అయినా హిట్ కాక చతికిల పడింది. ఇంకా మైదాన్ వంటి బయోపిక్స్ రిలీజ్ కు శరవేగంగా రెడీ అవుతున్నాయి. బాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా ఈ బయోపిక్స్ వరుసగా రిలీజ్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News