Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఐదేళ్ల ముందు ప్రారంభమైన ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూలై 24న రిలీజ్ కానుందంటూ వార్తలు వినిపిస్తు్నాయి. నిజానికి జూన్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ కారణంగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. హిస్టారికల్ టచ్‌తో రూపొందింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుని ఎదిరించే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ హీరోయిన్స్‌గా నటించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబు పాత్రలో నటించాడు. జాగర్లమూడి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. సనాతన ధర్మం కోసం పోరాడే యోధుడిగా పవర్‌స్టార్ కనిపించనున్నారు.
లేటెస్ట్ సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు జూలై 24న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుంది. అయితే సినీ అభిమానులు ఈ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఇప్పుడొక క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌లో జూలై 24 తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఈ డేట్ పవన్ అభిమానులకు ఓ సెంటిమెంటల్ డేట్ కూడా. ఎందుకంటే 1998 జూలై 24నే తొలిప్రేమ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఒక లవ్ స్టోరీగా వస్తూనే పవన్‌ను యూత్ ఐకాన్‌గా మార్చేసింది. దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా తీసుకుని సంధ్య 70 ఎంఎం లోనే తన మొత్తం పెట్టుబడిని వెనక్కి తీసుకున్న వాస్తవం అప్పట్లో గొప్ప విజయం ఏంటో చెప్పకనే చెబుతుంది. అంతే కాదు, చిరంజీవి నటించిన ఇంద్ర కూడా 2002 జూలై 24న రిలీజ్ అయ్యి టాలీవుడ్ రికార్డుల్ని తుడిచేసింది. ఆ విజయం చిరంజీవి కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే తేదీకి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ కావడంపై అభిమానుల్లో ఎనలేని ఆశలు నెలకొన్నాయి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/sharwanand-romancing-with-three-heroines-in-his-upcoming-films/
ఇక టెక్నికల్ వర్క్ గురించి మాట్లాడుకుంటే, దర్శకుడు జ్యోతికృష్ణ ఫైనల్ కట్ పనుల్లో బిజీగా ఉండగా, కీరవాణి రీ-రికార్డింగ్‌ను మరో వారం రోజుల్లో మొదలుపెట్టనున్నట్టు సమాచారం. ఈసారి ట్రైలర్‌తోనే మొత్తం గేమ్‌నే చేంజ్ చేస్తామని టీమ్ లో పూర్తి నమ్మకం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న తొలి సినిమా కావడం వల్ల ఇది ఫ్యాన్స్‌కి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌తో పాటు ట్రైలర్‌కి సంబంధించిన క్లారిటీ వస్తుందాఝ? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ పెరిగిపోయింది.
హరిహర వీరమల్లు విడుదలైన పక్క రోజునే అంటే జూలై 25న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతోన్న కింగ్‌డమ్ మూవీ రిలీజ్ కానుండటం డిస్కషన్ పాయింట్‌గా మారింది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.