Suhas: మందాడి మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు సుహాస్. తమిళ కమెడియన్ సూరి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సుహాన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. తెలుగు వెర్షన్‌లో మాత్రం సుహాస్ కథానాయకుడిగా నటిస్తుండగా.. సూరి విలన్ రోల్ చేస్తున్నాడు.
స్పోర్ట్స్ యాక్షన్ మూవీ…
సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా మందాడి మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. మందాడి షూటింగ్ తమిళనాడులోని రామనాథపురం జిల్లా తొండి సముద్ర తీరంలో జరుగుతుందట. సముద్రం నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా సాంకేతిక నిపుణుల పడవ బోల్తా పడినట్లు తెలిసింది. ఇద్దరు యూనిట్ సభ్యులతో పాటు కోటి రూపాయల విలువ చేసే కెమెరా సముద్రంలో మునిగిపోయాయట. యూనిట్ సభ్యులను ఇతర టీమ్ మెంబర్స్ కాపాడటంతో ప్రాణం నష్టం మాత్రం తప్పింది. కానీ ఆర్థికంగా మాత్రం భారీగా నష్టం జరిగింది. పడవ ప్రమాదం కారణంగా మందాడి షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మందాడి సినిమాకు మతిమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ తమిళ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.
Also Read- Pooja Hegde: పూజా హెగ్డేకు బంపరాఫర్ – అమరన్ డైరెక్టర్ మూవీలో హీరోయిన్‌గా బుట్టబొమ్మ
డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్…
తెలుగులో సుహాస్ బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు తర్వాత సుహాన్ నటించిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్‌తో ఆడియెన్స్‌ను డిజపాయింట్ చేశాడు. ప్రసన్నవదనం పర్వాలేదనిపించినా శ్రీరంగనీతులు, గొర్రెపురాణం, జనక అయితే గనక, ఓ భామ అయ్యో రామతో పాటు ఓటీటీలో రిలీజైన ఉప్పుకప్పురంబు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. మందాడిపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం మందాడితో పాటు తెలుగులో కేబుల్ రెడ్డి, ఆనందరావు అడ్వెంచర్స్ సినిమాలు చేస్తున్నాడు సుహాస్. సినిమాల స్పీడు తగ్గించాడు.
Also Read- Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ


