Govardhan Asrani Died: ప్రముఖ బాలీవుడ్ దర్శక, నటుడు గోవర్ధన్ అస్రాని (84) సోమవారం కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాలుగు రోజుల క్రితం ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. అస్రాని మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/hero-ram-pothineni-intresting-comments-on-ram-charan/
1941లో జైపూర్‌లో జన్మించిన గోవర్ధన్ అస్రాని.. తన 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా సినిమాల్లో గొప్ప పాత్రలు చేశారు. హిందీ సినిమాల్లో కమెడియన్, సపోర్టింగ్ నటుడిగానే కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. మేరే అప్నే, కోషిష్, బావర్చీ, పరిచయ్, అభిమాన్, చుప్కే చుప్కే లాంటి సూపర్ హిట్ సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు. బ్లాక్‌బస్టర్ మూవీ ‘షోలే’లో జైలర్‌గా కీలక పాత్రలో ఇమిడిపోయారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/gunasekhar-latset-movie-euphoria-release-date-announced/
సినీ రంగంలోకి రాకముందు ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన గోవర్ధన్ అస్రాని.. ఆ జీతంతో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1962లో నటనపై మక్కువతో ముంబయి చేరుకున్నారు. దర్శకులు కిశోర్ సాహి, హృషికేశ్ ముఖర్జీ సలహా మేరకు పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌పై నటనలో ప్రావీణ్యం సాధించారు. సినిమాల్లో నటించడంతో పాటు చలో మురారి హీరో బన్నే, ఉడాన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.


