Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభDharmendra: ఇది క్ష‌మించరాని నేరం.. ఫైర్ అయిన హేమా మాలిని, ఈషా డియోల్‌

Dharmendra: ఇది క్ష‌మించరాని నేరం.. ఫైర్ అయిన హేమా మాలిని, ఈషా డియోల్‌

Dharmendra: బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు ధ‌ర్మేంద్ర చ‌నిపోయారంటూ నేష‌న‌ల్ మీడియాలో వార్త‌లు తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో ప్రాంతీయ వార్తా సంస్థ‌లు సైతం వీటిని ఫాలో అయ్యాయి. అయితే వీటిపై ఆయ‌న స‌తీమ‌ణి, కుమార్తె, ఇత‌ర కుటుంబ స‌భ్యులు మాత్రం ఫైర్ అయ్యారు. ‘నాన్న కోలుకుంటున్నారు. త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌కండి. ఆయ‌న కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన వారికి ధ‌న్య‌వాదాలు’ అంటూ ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

- Advertisement -

https://www.instagram.com/p/DQ5srn_CGe_/

ఇక ధ‌ర్మేంద్ర స‌తీమ‌ణి, న‌టి హేమా మాలిని అయితే త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌సారం చేసిన వారిపై ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదిక‌గా ఆమె మాట్లాడుతూ ‘‘ఇది క్ష‌మించ‌రాని నేరం. ధ‌ర్మేంద్ర చికిత్స‌కు స్పందిస్తున్నారు. కోలుకుంటున్న వ్య‌క్తిని ఇలాంటి వార్త‌ల‌ను రాయ‌టం అనేది బాధ్య‌తారాహిత్యం’’ అన్నారు. ఇత‌ర కుటుంబ స‌భ్యులు సైతం ఈ వార్త‌ల‌ను ఖండించారు. ధ‌ర్మేంద్ర చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వారు అన్నారు.

Also Read – Maganti Sunitha: ‘ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి.. 14వ తేదీ తర్వాత చూసుకుందాం’

సీనియ‌ర్ న‌టుడు ధ‌ర్మేంద్ర గ‌త కొన్నాళ్లుగా శ్వాస సంబంధింత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల చికిత్స కోసం ముంబైలో బ్రీచ్ కాండీ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. ధ‌ర్మేంద్ర‌కు ఏదో అయిపోయిందంటూ వార్త‌లు వినిపిస్తూనే వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌ను ఇటు కుటుంబ స‌భ్యులు, అటు హ‌స్పిట‌ల్ వ‌ర్గాలు ఖండిస్తూ వ‌చ్చాయి. తాజాగా ఈరోజు ఏకంగా ఆయ‌న మ‌ర‌ణించార‌నే వార్త‌ల‌ను పుట్టించారు. ఇది ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు మ‌రింత బాధ‌ను క‌లిగించాయి.

Also Read – Deviyani Sharma: బోల్డ్ లుక్స్ తో మెంటలెక్కిస్తున్న దేవియాని

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad