Mirai Movie: తేజా సజ్జా మిరాయ్ మూవీకి శ్రీరాముడు క్యారెక్టర్ ఓ హైలైట్‌గా నిలిచింది. సినిమాపై బజ్ రావడానికి ఈ పాత్ర ఓ కారణమైంది. రిలీజ్‌కు ముందు రాముడి పాత్రలో మహేష్‌బాబు నటించినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత నాని, రానా దగ్గుబాటిలలో ఒకరు ఈ పౌరాణిక పాత్రను పోషించినట్లు బలంగా వార్తలు వినిపించాయి. కానీ మేకర్స్ మాత్రం రిలీజ్ వరకు ఈ సీక్రెట్‌ను రివీల్ చేయలేదు. సర్‌ప్రైజ్ అంటూ మాట దాటేస్తూ వచ్చారు.
రెండు నిమిషాలే…
మిరాయ్‌లో శ్రీరాముడిగా పాత్రను చేసిన నటుడు ఎవరన్నది వెల్లడైంది. ఈ క్యారెక్టర్‌ను ఉత్తరాఖండ్‌కు చెందిన గౌరవ్ బోరా చేశారు. మిరాయ్ క్లైమాక్స్‌లో కేవలం రెండు నిమిషాల్లోపే శ్రీరాముడి పాత్ర అభిమానులకు కనిపిస్తుంది. కానీ థియేటర్లలో మాత్రం గౌరవ్ బోరా క్యారెక్టర్ చాలానే ఇంపాక్ట్ చూపిస్తోంది. అతడు కనిపించే సీన్స్‌తో మొత్తం థియేటర్లు షేక్ అవుతున్నాయి. శ్రీరాముడి పాత్రకు కథను కనెక్ట్ చేసిన తీరు అధ్బుతమంటూ ఆడియెన్స్ చెబుతున్నారు.
మహేష్‌బాబు పోలికలు…
గౌరవ్ బోరాలో కొంత వరకు మహేష్‌బాబు పోలికలు కనిపిస్తాయి. లాంగ్ షాట్స్‌లో మహేష్‌బాబులానే కనిపించడంతో అందరూ శ్రీరాముడిగా గెస్ట్ రోల్ చేసింది అతడేనని అనుకున్నారు. రిలీజైన తర్వాతే ఈ ట్విస్ట్ బయటపడింది.
బాలీవుడ్‌లో ఫేమస్…
గౌరవ్ బోరా తెలుగు ఆడియెన్స్‌కు కొత్త. కానీ హిందీలో చాలా సీరియల్స్, సినిమాలు చేశాడు. మాస్ కమ్యూనికేషన్స్ చదివిన గౌరవ్ యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని యాడ్ ఫిల్మ్స్‌లో నటించాడు. మిరాయ్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
శ్రీరాముడి పాత్ర కోసం చాలా మంది యాక్టర్స్‌ను పరిశీలించిన డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని చివరకు ఓ యాడ్ చూసి గౌరవ్‌ను అప్రోచ్ అయ్యాడట. ఆడిషన్ చేసి అతడిని సెలెక్ట్ చేశాడట. నిడివి తక్కువే అయినా తన రోల్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని గౌరవ్ అన్నారు.
81 కోట్ల వసూళ్లు…
కాగా మిరాయ్ మూవీ మూడు రోజుల్లోనే 81 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటించాడు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది.
మిరాయ్ సక్సెస్ మీట్…
కేవలం 70 కోట్ల కలెక్షన్స్‌తో టీజీ విశ్వప్రసాద్ మిరాయ్ మూవీని నిర్మించారు. కానీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ నాలుగైదు వందల కోట్ల సినిమాల మాదిరిగా ఉన్నాయని ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు ఈ సినిమాను సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. మిరాయ్ సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


