Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభUrvashi Rautela: లండన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఊర్వశి రౌతేలా బ్యాగ్ చోరీ.. అందులో ఏముందో తెలుసా?

Urvashi Rautela: లండన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఊర్వశి రౌతేలా బ్యాగ్ చోరీ.. అందులో ఏముందో తెలుసా?

Urvashi Rautela: బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు లండన్‌లో చేదు అనుభవం ఎదురైంది. గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో ఊర్వశి యెుక్క లగ్జరీ సూట్‌కేస్ చోరీకి గురైంది. అందులో సుమారు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ఊర్వశి గురువారం త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా దీనిని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, వింబుల్డన్ అధికారులకు కూడా ట్యాగ్ చేశారు.

- Advertisement -

”నేను ముంబై నుంచి ఎమిరేట్స్ కు ఫ్లైట్ లో లండన్ వెళ్లాను. అక్కడ గాట్విక్ ఎయిర్ పోర్టులో బ్యాగేజీ బెల్ట్ నుంచి నా లగేజీ చోరీకి గురైంది. బ్యాగేజీ బ్యాగ్, టికెట్ ఉన్నప్పటికీ బెల్ట్ ప్రాంతం నుంచి బ్యాగ్ పోవడం నన్ను షాక్ కు గురిచేసింది..” అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు ఊర్వశి.

ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు ఊర్వశి. అయితే పోలీసుల నుంచి గానీ, విమానాశ్రయ సిబ్బంది నుంచి గానీ తగిన సహకారం అందలేదని ఆమె వాపోయారు. లండన్‌లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్లారు ఊర్వశి.

ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదుర్కోవడం ఊర్వశికి కొత్తమీ కాదు, 2023లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో కూడా ఈమె రూ. 45 లక్షల విలువైన చెవిపోగు పోగొట్టుకున్నారు. మరోకసారి ఐఫోన్ కూడా పొగొట్టుకున్నారు. ఈమె సనమ్ రే, సింగ్ సాబ్ ది గ్రేట్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీలో ఐటెం సాంగ్ చేసి ఫేమస్ అయింది. అంతేకాకుండా అంతకంటే ముందు రామ్ స్కంద, అఖిల్ ఏజెంట్, సాయిధరమ్ తేజ్-పవన్ కల్యాణ్ బ్రో, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ గుర్తింపు తెచ్చుకుంది.

Also Read: Karnataka – టికెట్స్ ఇవ్వకుండా.. ఫోన్ కాల్‌లో మునిగిపోయిన రైల్వే క్లర్క్.. వీడియో వైరల్!

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad