Heroine: బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా శర్మ (Karishma sharma) రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకడంతో వీపు, తలకు దెబ్బలు తగిలాయట. పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన కరిష్మా శర్మ ప్రస్తుతం హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. ఈ యాక్సిడెంట్ గురించి స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది కరిష్మా శర్మ.
లోకన్ ట్రైన్…
ఓ సినిమా షూటింగ్ లోకేషన్‌కు వెళ్లడానికి ముంబై లోకల్ ట్రైన్ ఎక్కాను. స్పీడు పెరగడంతో నా స్నేహితులు ట్రైన్‌ను అందుకోలేకపోయారు. వారు ఎక్కలేదనే టెన్షన్‌లో నేను ట్రైన్ నుంచి కిందికి దూకేశాను. వెనక్కి తిరిగిపడటంతో వీపుకు, తలకు దెబ్బలు తగిలాయి. మరికొన్ని చిన్న చిన్న గాయాలు అయ్యాయి. తలకు దెబ్బ తగలడంతో డాక్టర్లు ఎమ్ఆర్ఐ స్కాన్ చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. అందరి ప్రేమాభిమానుల వల్లే ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగాను అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కరిష్మా శర్మ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్నేహితులు ఆమెను హాస్పిటల్‌కు తీసుకొచ్చారట. కరిష్మా శర్మ త్వరగా కోలుకోవాలంటూ ఆమె పోస్ట్‌కు అభిమానులు రిప్లై ఇస్తున్నారు.
టీవీ సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభం…
టీవీ సీరియల్స్, మ్యూజిక్ వీడియోలతో బాలీవుడ్‌లో ఫేమస్ అయ్యింది కరిష్మా శర్మ. పవిత్రా రిష్తా, ప్యార్ తునే క్యా కియా, సిల్ సిలా ప్యార్ కాతో పాటు పలు సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేసింది. కామెడీ సర్కస్, ది కపిల్ శర్మ షోలతో ప్రేక్షకులను మెప్పించింది.
బాలీవుడ్ సినిమాలు…
ప్యార్ కా పంచ్‌నామా 2 మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కరిష్మా శర్మ. హోటల్ మిలాన్, సూపర్ 30, ఎక్ విలన్ రిటర్న్స్ సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది. సీరియల్స్ స్థాయిలో సినిమాలు ఆమెకు పేరును తెచ్చిపెట్టలేకపోయాయి. రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్, ఫిక్సర్ వంటి వెబ్‌సిరీస్‌లలో నటించింది.
సినిమాల పరంగాసక్సెస్‌లు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం కరిష్మా శర్మకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు రెండున్నర మిలియన్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారు.
Also Read- Kishkindhapuri Review: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమల ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ


