Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKatrina Kaif: నాగార్జున పాన్ ఇండియా ప్లానింగ్.. బాలీవుడ్ బ్యూటీ కంబ్యాక్!

Katrina Kaif: నాగార్జున పాన్ ఇండియా ప్లానింగ్.. బాలీవుడ్ బ్యూటీ కంబ్యాక్!

Katrina Kaif: కింగ్ నాగార్జున తన కెరీర్‌లో మైలురాయి లాంటి 100వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఎంతో మంది ద‌ర్శ‌కుల్ని పరిశీలించిన నాగ్ చివరగా తమిళ ద‌ర్శ‌కుడు కార్తీక్‌కు (Karthik) అవకాశం ఇవ్వటం కొస మెరుపు. ద‌ర్శ‌కుడిగా కార్తీక్‌కు పెద్దగా అనుభ‌వం లేక‌పోయినా, క‌థ‌పై ఉన్న న‌మ్మ‌కంతో కింగ్ నాగార్జున (King Nagarjuna) ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం క‌థాంశం గురించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. కానీ ప్రీ-ప్రొడ‌క్ష‌న్ పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి.

- Advertisement -

Also Read- Keerthi suresh new projects: వరుస చిత్రాలతో కీర్తీ దూకుడు.. రౌడీ బాయ్ సినిమా ఆఫర్ కూడా..!

ఈ నేపథ్యంలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న నాగ్ 100వ చిత్రంలో ఆయనకు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) నటించనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కత్రినా కైఫ్‌ని హీరోయిన్‌గా నటింప చేయటానికి టీమ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమా కింగ్ నాగార్జున రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌లో సినిమా వర్కౌట్ అవ్వాలంటే, కత్రినా లాంటి స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందని మేకర్స్ భావించే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. మరి ఈ ఆఫర్‌కు కత్రినా ఎలా స్పందిస్తుందో చూడాలి.

కత్రినా కైఫ్‌కు టాలీవుడ్‌తో ఇది కొత్తేమీ కాదు. ఆమె తన కెరీర్ ఆరంభంలోనే విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘మల్లీశ్వరి’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ మూవీలో వెంకటేష్‌తో పాటు కత్రినా నటన కూడా ప్రేక్షకులను అలరించింది. అలా ‘మల్లీశ్వరి’ ద్వారా తెలుగు ఆడియన్స్‌కు కత్రినా కైఫ్ బాగా కనెక్ట్ అయింది. తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన అల్లరి పిడుగు చిత్రంలోనూ కత్రినా నటించింది. తర్వాత ఆమెకు తెలుగులో చాలా అవకాశాలు, స్టార్ హీరోల సరసన ఛాన్సులు వచ్చినా, ఆమె వాటిని సున్నితంగా తిరస్కరించి బాలీవుడ్ పైనే ఫోకస్ చేసింది.

Also Read- Tollywood: టాలీవుడ్‌లో మైథ‌లాజిక‌ల్ సినిమాల ట్రెండ్ – భ‌క్తి క‌థ‌ల‌పై స్టార్ హీరోల మోజు

ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అలియా భట్, దీపికా పదుకొణే వంటి బాలీవుడ్ తారలు కూడా తెలుగు చిత్రాల్లో నటించి పాన్ ఇండియా సక్సెస్‌ను అందుకున్నారు.. టాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ పాన్ ఇండియా ట్రెండ్‌లో కత్రినా కైఫ్ కూడా మళ్ళీ టాలీవుడ్‌లోకి తిరిగి వస్తుందో లేదో వేచి చూడాలి. నాగార్జున 100వ సినిమా మరియు కత్రినా కైఫ్ కాంబినేషన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad