Tollywood Heroine: ఓ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఓ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది సదరు మేకప్ ఆర్టిస్ట్. స్టార్ హీరోయిన్‌తో పాటు ఆమె తల్లిపై కూడా విరుచుకుపడింది.
నాకు ఫోన్ చేయద్దు…
ఓ స్టార్ హీరోయిన్ గత కొద్ది రోజులుగా నన్ను వేధింపులకు గురిచేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులతో పాటు టీమ్ మెంబర్స్ నాతో చాలా అమర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. దక్షిణాదిలో వాళ్లకు తక్కువ మొత్తానికి లేదంటే ఫ్రీగా పనిచేసినట్లు బాలీవుడ్‌లో కూడా పనిచేస్తారని అనుకుంటున్నారు. మాకు చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. నాకు నీతో పనిచేయడం ఇష్టం లేదు. నాకు ఫోన్, మెసేజ్‌లు చేయకు అని ఈ పోస్ట్‌లో మేకప్ ఆర్టిస్ట్ పేర్కొన్నది. అంతే కాకుండా ఆమె కుటుంబానికి చెందిన ఓ మనిషి నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. నాకు మీతో పనిచేయాలని లేదు. మా డబ్బులు నొక్కేయడం ఆపేయండి. లేదంటే మీ పేర్లు బయటపెడతాను అంటూ స్టార్ హీరోయిన్‌కు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా మేకర్ ఆర్టిస్ట్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Also Read- Smriti Irani: దీపికా పదుకొణె 8 గంటల పని.. వివాదంపై స్మృతి ఇరానీ కౌంటర్
త్వరలో బాలీవుడ్‌లోకి…
తెలుగులో టాప్ హీరోలతో సినిమాలు చేసిన ఆ హీరోయిన్ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నదట. ఆమె డెబ్యూ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు టాక్. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే మరికొన్ని ఆఫర్లు అందుకున్నట్లు చెబుతున్నారు. ఆ హీరోయిన్‌కు సంబంధించి డేట్స్ మొదలుకొని మిగిలిన అన్ని వ్యవహారాలను ఆమె తల్లి చక్కబెడుతుందట. ప్రొడ్యూసర్లు ఏర్పాటు చేసే మేకప్ ఆర్టిస్ట్‌ల బదులుగా తమకు నచ్చిన వాళ్లను ఆ హీరోయిన్ తల్లి స్వయంగా నియమించుకుంటుందట. ఆ మేకప్ ఆర్టిస్ట్‌లకు ఇచ్చే డబ్బులకు రెట్టింపు నిర్మాతల నుంచి ఆ హీరోయిన్ తల్లి వసూళ్లు చేస్తున్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎవరో తెలుసు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ లీలలు ఆపితే మంచిదంటూ పేర్కొంటున్నారు. ఈ వివాదం బాలీవుడ్ సర్కిల్‌లో కూడా హాట్‌హాట్‌గా మారినట్లు చెబుతున్నారు.


