Saiyaara OTT: కొత్త హీరోహీరోయిన్లతో చిన్న సినిమాగా రిలీజైన బాలీవుడ్ మూవీ సైయారా అంచనాలకు మించి విజయాన్ని సాధించింది. యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 600 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. ఇండియన్ రొమాంటిక్ మూవీస్‌లో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
నెట్‌ఫ్లిక్స్‌లో…
థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది. సైయారా స్ట్రీమింగ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. సైయారా మూవీతో అహాన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లుగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రొమాంటిక్ మ్యూజికల్ లవ్ డ్రామాగా డైరెక్టర్ మోహిత్ సూరి ఈ సినిమాను తెరకెక్కించారు. కొరియన్ మూవీ ఏ మూమెంట్ టూ రిమెంబర్ ఆధారంగా సైయారా మూవీ తెరకెక్కినట్లుగా ప్రచారం జరిగింది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది.
Also Read – Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9.. ఎంట్రీపై నాగ దుర్గ క్లారిటీ
యాక్షన్, వీఎఫ్ఎక్స్, మాస్ ఎలిమెంట్స్ లాంటి కమర్షియల్ హంగులకు దూరంగా ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీగా దర్శకుడు మోహిత్ సూరి సైయారా సినిమాను తెరకెక్కించిన తీరుకు బాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తొలి సినిమానే అయినా అహాన్ పాండే, అనీత్ పడ్డా తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. పాటలు ఈ సినిమా విజయంలో కీలకంగా నిలిచాయి. ఈ ఏడాది బాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన రెండో మూవీగా సైయారా నిలిచింది.
సైయారా కథ ఇదే…
వాణి (అనీత్ పడ్డా) ఓ రైటర్. కాలేజీలో సీనియర్ అయిన మహేష్‌ను ప్రేమించిన వాణి అతడితో పెళ్లికి సిద్ధపడుతుంది. కానీ వాణిని మోసం చేసి ఆమెకు దూరంగా వెళ్లిపోతాడు మహేష్. ఆ లవ్ బ్రేకప్ నుంచి బయటపడిన వాణి జీవితంలోకి క్రిష్ వస్తాడు. సింగర్‌గా పేరుతెచ్చుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు క్రిష్. ఓ పాట కోసం క్రిష్, వాణి ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. అదే టైమ్‌లో వాణి లైఫ్‌లోకి మహేష్ మళ్లీ వస్తాడు. క్రిష్, మహేష్‌లలో ఎవరి ప్రేమకు వాణి ఓకే చెప్పింది అన్నదే సైయారా మూవీ కథ.
Also Read – Ganesh Immersion : గంగమ్మ ఒడికి గణపయ్య.. విద్యుత్ కాంతుల్లో హుస్సేన్‌సాగర్!


