Aamir Khan Remunaration: సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’. యంగ్ సెన్సేషన్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు మాత్రం రాబడుతోంది. కలెక్షన్స్ పరంగా కూలీ కోలీవుడ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో భారీ తారాగణం నటించిన సినిమాగా కూలీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ మూవీలో నాగార్జున అక్కినేని ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఇంకా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీ హాసన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Also Read – WAR 2 Climax : క్లైమాక్స్… ఎన్టీఆర్ కోసమే మార్చారా?
తాజాగా బాలీవుడ్ ఆమిర్ ఖాన్ రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అతిథి పాత్రలో నటించటానికి ఆమిర్ ఏకంగా రూ.20 కోట్లు తీసుకున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్లను చిత్ర బృందం ఖండించినా, వాటికి ఫుల్‌స్టాప్ పడలేదు. అయితే తాజాగా ఆమిర్ ఖాన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తన పారితోషికంపై స్పందించి అన్ని ఊహాగానాలకు తెరదించారు. ‘ఈ సినిమా కోసం నేను రూపాయి కూడా తీసుకోలేదు’ అని ఆయన కుండబద్దలు కొట్టారు. రజనీకాంత్ అంటే తనకు ఉన్న ప్రేమ, అభిమానానికి వెలకట్టలేమని ఆమిర్ స్పష్టం చేశారు. ఆయనతో కలిసి తెరపై కనిపించడమే తనకు కోట్లాది రూపాయలతో సమానం, అది దేనితోనూ పోల్చలేని ఒక పెద్ద రివార్డు అని పేర్కొన్నారు.
‘కూలీ’ చిత్రంలో తాను కేవలం అతిథి పాత్రలో మాత్రమే కనిపించానని, రజనీకాంత్, నాగార్జునలే ఈ సినిమాకు అసలైన హీరోలు అని ఆమిర్ ఖాన్ అన్నారు. ప్రేక్షకులు ఈ స్థాయిలో ఆసక్తిగా చూస్తున్నారంటే అది రజనీకాంత్, నాగార్జునలను చూసేందుకే తప్ప, తన కోసం కాదని వినమ్రంగా చెప్పారు. దీంతో గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ఆమిర్ ఖాన్ రెమ్యునరేషన్ వార్తలకు పూర్తిగా చెక్ పడినట్లైంది. కూలీ చిత్రంలో మాఫియా నాయకుడు దాహా పాత్రలో ఆమిర్ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే.మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.
Also Read – Actress Anandhi: లేలేత అందాలతో మాయ చేస్తున్న ఆనంది
ఆమిర్ ఖాన్ తన పారితోషికంపై చేసిన ఈ స్పష్టమైన ప్రకటనతో, కేవలం ఆర్థిక లాభాపేక్షతో కాకుండా, అభిమానంతోనే ఈ సినిమాలో నటించారని తేలింది. ఇది సినిమా పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను, రజనీకాంత్ పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది.


