Honeymoon Murder Case: నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాలను రూపొందించటం సర్వ సాధారణమైన విషయమే. ఇలాంటి సినిమాలు తెరకెక్కించేటప్పుడు కంటెంట్ ఎంత ప్రధానమైన విషయమో, ఎమోషన్స్ కూడా ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు అలాంటి రియల్ ఇన్సిడెంట్‌తో బాలీవుడ్‌లో సినిమా రూపొందనుంది. ఈ సినిమాను చేయబోయేది ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్. వివరాల్లోకి వెళితే రీసెంట్‌గా మేఘాలయలో హనీమూన్ హత్య జరిగింది. ఇది ఎన్నో మలుపులతో సినిమాను మించేలా ట్విస్టులతో ఉంది. ఈ కేసుని చేధించటానికి పోలీసులకు చాలా కష్టమైంది. అయినప్పటికీ దాన్ని వాళ్లు ఛాలెంజింగ్‌గా తీసుకుని సాల్వ్ చేశారు.
హత్యను సాల్వ్ చేసిన పోలీసులు చెప్పిన విషయాలు విని అందరూ నిర్ఘాంత పోయారు. అసలు ఎవరూ ఊహించని విధంగా భార్య తన ప్రియుడితో కలిసి పథకం వేసింది. భర్తతో కలిసి మేఘాలయకు హనీమూన్ వెళ్లినప్పుడు కిరాయి రౌడీలను పూరమాయించింది. వాళ్లు వచ్చి భర్తను చంపేసి లోయలో విసిరేశారు. భార్య కూడా కనిపించలేదు. భర్త శవం దొరికిన తర్వాత పోలీసులు సీరియస్‌గా అన్వేషిస్తే ఆమె ఉత్తరప్రదేశ్‌లో కనిపించింది. ఇది పోలీసులకు అర్థం కాలేదు. దీంతో వాళ్లు ఆమె కోణంలో కేసుని దర్యాప్తు చేయటం ప్రారంభించటంతో అసలు విషయం బయటకు వచ్చింది.
Also Read – Shubhanshu Shukla: మైక్రోగ్రావిటీ రికవరీ శిక్షణ పొందుతున్న శుభాంశు శుక్లా.. వీడియో ఇదిగో..!
ఈ మిస్టరీ కథాంశాన్నిసిల్వర్ స్క్రీన్‌పై మరింత ఉత్కంఠభరితంగా చూపించేందుకు ఆమిర్ ఖాన్ ప్రయత్నిస్తున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన చేసిన ‘తలాష్’ సినిమా తరహాలోనే, ఇది కూడా సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందనుందట. పైగా, ఈ కథ ఒక వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిస్తుండడం మరింత ఆసక్తికరంగా మారింది. థ్రిల్‌తో పాటు భావోద్వేగాలు కూడా ఉండే ఈ కథ, మంచి కథానికను ఇష్టపడే ప్రేక్షకులకు ఓ మజిలీలా అనిపించవచ్చు.
Also Read – Tamannaah Bhatia: ప్రతి తప్పు ఓ పాఠమే – లవ్ బ్రేకప్‌పై తమన్నా రియాక్షన్ – వైరల్ అవుతోన్న పోస్ట్…


