Bollywood Updates: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూతురు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తన కెరీర్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. సినిమాలతోపాటు ఫ్యామిలీని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తోంది అలియా. తన గారాల పట్టి రాహా కోసం ఫ్యూచర్ లో తాను నటించే సినిమాల జోనర్‌ను పూర్తిగా మార్చుకోబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీ బాయ్, గంగూబాయి కతియావాడి వంటి సీరియస్ పాత్రల్లో నటించి అందరి అభిమానాన్ని చూరగొన్నది. ఇకపై సీరియస్ పాత్రల కాకుండా కామెడీ జోనర్ ట్రై చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా తన కూతురు రాహా అని ఆమె పేర్కొంది.
ఇంతవరకు నా కూతురు రాహా ఆనందించే ఒక్క మూవీ కూడా నేను చేయలేదు. అందుకే భవిష్యత్తులో తాను చేయబోయే సినిమాలన్నీ నవ్వుకునే విధంగా ఉండాలని అనుకుంటానని.. ఈ మార్పుకు కారణం తన కూమార్తెనని ఆమె చెప్పింది. ఈ జోనర్ కు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఓకే చేశాను, వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను అని అలియా తెలిపింది. ప్రస్తుతం అలియా తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా షూటింగ్, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడంపై ఆమె మాట్లాడింది. “మేమిద్దరం షూటింగ్‌లో ఉన్నప్పుడు రాహాను చూసుకోవడం కాస్త కష్టమే. అయితే మూవీ షూటింగ్ ఎక్కువగా రాత్రి వేళల్లో ఉండటంతో.. పగలంతా రాహాతో గడిపి నైట్ షూట్ కు వచ్చేవాళ్లం. కొన్ని సార్లు రాహా సెట్ కు వచ్చి మాతో గడిపేది” అని అలియా చెప్పుకొచ్చింది.
Also Read: Niharika Konidela: సారీ అమ్మ.. ఇన్‌స్టాగ్రమ్‌లో మెగా డాటర్ నిహారిక పోస్ట్..
ఆలియా, రణబీర్ వివాహం 2022 ఏప్రిల్ 14న ముంబయిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జంటకు 2022 నవంబర్ 6న పాప రాహా జన్మించింది. అలియా చివరిసారిగా జిగ్రా అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలింస్ యెుక్క స్పై థ్రిల్లర్ ఆల్ఫా మరియు సంజయ్ లీలా భన్సాలీ యొక్క లవ్ అండ్ వార్‌లో నటిస్తోంది.


